జూనియర్ ఎన్టీఆర్‌కి పొలిటికల్ పంచ్‌లు,పొలిటికల్ టచ్‌లు ఉంటే ఆ చిత్రాలు సరిగా ఆడవనే కొత్త సెంటిమెంట్ బయలు దేరింది. అలాంటి టచ్ ఇచ్చిన 'నాగ', సైకిల్‌పై వచ్చానని... అంటూ దీనిపై ఇంకెవ్వరూ రారనుకున్నారా? రాలేడనుకున్నారా? అన్న 'కంత్రి',కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చిన 'దమ్ము, రామయ్యా వస్తావయ్యా' అనే చిత్రాలు సరిగా ఆడలేదు. దాంతో ఎన్టీఆర్ పొలిటికల్ టచ్ ఇచ్చినా, పొలిటికల్ పంచ్‌లు పేల్చినా దెబైపోతాడని, ఆయన ప్రస్తుతం రావణాసురుడి అంశతో సమ సమాజ్ పార్టీ నాయకునిగా, నెగటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్ర కూడా 'జై లవ కుశ'లో పొలిటికల్ టచ్ ఉండటంతో ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుందని నందమూరి యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కానీ ఆయా చిత్రాలలో కంటెంట్ లేకే ఆడలేదని, కేవలం పొలిటికల్ టచ్ ఇవ్వడమే ఆ చిత్రాల పరాజయానికి కారణం కాదని అందరూ తేల్చేస్తున్నారు. అందునా 'జై లవ కుశ'లో త్రిపాత్రాభినయం చేస్తుండటం, పొలిటికల్ టచ్ ఉండే నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర, అందులోని అభినయం, డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఎన్టీఆర్ ప్రతి విషయాన్ని ఈ చిత్రంలో ఆచితూచి చేస్తున్నాడని,
'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్'లతో ఎన్టీఆర్‌లో కథల, సినిమా ఎంపికలో పరిపక్వత వచ్చిందని, దాంతోనే ఎన్నో కథలు, దర్శకులను పరిశీలించి చివరకు ఆయన బాబికి ఓకే చెప్పాడు కాబట్టి ఈ చిత్రాన్ని అలాంటి నెగటివ్ సెంటిమెంట్స్ ఏమీ చేయలేవని ఆయన అభిమానులు ఘంటాపధంగా చెబుతున్నారు.