Advertisementt

రవితేజకు నాగ్‌కు మద్య పోటీ...!

Tue 25th Jul 2017 06:12 PM
ravi teja,raja the great movie,nagarjuna raju gari gadhi 2 movie  రవితేజకు నాగ్‌కు మద్య పోటీ...!
Competition Between Nagarjuna and Ravi Teja రవితేజకు నాగ్‌కు మద్య పోటీ...!
Advertisement
Ads by CJ

నాగార్జున ప్రస్తుతం ఓంకార్‌ దర్శకత్వంలో పివిపి బేనర్‌లో 'రాజు గారి గది 2'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉండటంతో, కొన్ని సీన్స్‌ని మరలా రీషూట్‌ చేయనుండటం వల్ల ఇప్పటికీ పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలుకాలేదు. ఇందులో మనుషుల మనసులతో ఆడుకునే ఓ సైకాలిజిస్ట్‌గా నాగార్జున నటిస్తుండగా, మరోవైపు ఆయన కాబోయే కోడలు సమంత దెయ్యంగా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. 

మొత్తానికి ఈ చిత్రం ద్వారా ఇప్పటి వరకు ఎవ్వరూ నాగార్జునని చూడని సరికొత్త యాంగిల్‌లో నాగ్‌ పాత్ర, ఆయన లుక్‌లు విభిన్నంగా ఉంటాయని, ఆయన పాత్ర కూడా ఎంతో వైవిధ్యంతో సాగుతుందని దర్శకుడు ఓంకార్‌తో పాటు నాగార్జున కూడా చెబుతున్నారు. ఇక ఇందులో ఓంకార్‌ సోదరుడు అశ్విన్‌,సీరత్‌ కపూర్‌, వెన్నెల కిషోర్‌ల పాత్రలు వైవిధ్యంగా ఉంటాయట. ఇక ఈ చిత్రాన్ని మొదట దీపావళికి ముందు వచ్చే వీకెండ్‌లో అంటే అక్టోబర్‌12న రిలీజ్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని ఓ రోజు తర్వాత అంటే అక్టోబర్‌13న విడుదల చేస్తారట. 

ఆ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. గతేడాది అదే తేదీన 'రాజు గారి గది' మొదటి భాగం రిలీజై పెద్ద విజయం సాధించింది. అదే సమయంలో నాగార్జున 'రాజు గారి గది 2' డేట్‌ ఇప్పుడు రవితేజ-దిల్‌ రాజులకు ఇబ్బందిగా మారింది. రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'రాజా ది గ్రేట్‌' చిత్రాన్ని అక్టోబర్‌ 12న రిలీజ్‌ చేస్తామని దిల్‌ రాజు కొద్ది రోజుల కిందటే అనౌన్స్‌ చేశాడు. మరి ఈ రెండు చిత్రాలు పక్కపక్కన రోజే వస్తాయా? లేక ఎవరైనా తేదీని మార్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది..! 

Competition Between Nagarjuna and Ravi Teja:

nagarjuna acted movie'Raju Gari Gadhi 2' release on October 13th and Ravi Teja acted movie 'Raja The Great' release on October 12th.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ