ప్రస్తుతం మహేష్ బాబు బాగా జోరుమీదున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'స్పైడర్' చిత్రంపై తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా మంచి అంచనాలున్నాయి. మహేష్ నటిస్తున్న తొలి తమిళ స్ట్రెయిట్ చిత్రం కాబట్టి, ఇక టాలీవుడ్‌లో 'బ్రహ్మూెత్సవం'ని మర్చిపోయేలా నిర్మాతలు త్వరలోనే ప్రమోషన్ వేగాన్ని బాగా పెంచనున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కావడంతో ఆగష్టు9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయనున్నారు.
ఇప్పటికే మొదటి టీజర్ రిలీజ్ అయినప్పటికీ సినిమాలో లేని సీన్‌తో ఆ టీజర్‌ని తీశారు. కానీ ఈసారి మాత్రం సినిమాలోని సీన్స్‌తోనే టీజర్ రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఆరోజు నుంచి భారీ ప్రమోషన్లకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 50 రోజుల ముందుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడమంటే ఈజీ కాదు. ఇక ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ మొదటి వారంలో తెలుగులో, తమిళంలో వేర్వేరుగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం మహేష్ 'స్డైడర్'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యంగ్‌సీఎంగా ఇందులో కనిపించనున్నాడు మహేష్. ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో భారీ అసెంబ్లీ సెట్‌ని కూడా వేస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు కానుకగానే 'భరత్ అనే నేను' చిత్రం ఫస్ట్‌లుక్‌ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అంటే మహేష్ బర్త్‌డే రోజున డబుల్ థమాకా ఖాయమనే చెప్పాలి...!