మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో బైలింగువల్ గా తెరకెక్కతున్న 'స్పైడర్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు ఇప్పటి వరకు తన సినిమాలను తమిళ్ లోకి డబ్బింగ్ చేస్తూ వస్తున్నాడు. కానీ అక్కడ అవేమి పెద్దగా ఫలితాన్ని చూపెట్టలేదు. భారీగా అక్కడ డబ్ చేసి విడుదల చేసినప్పటికీ మంచి కలెక్షన్స్ ఏమి రాబట్టలేదు. అయితే ఇప్పుడు మాత్రం మహేష్ తాను డైరెక్ట్ గానే తమిళ్ మూవీ చేస్తున్నాడు. మురుగదాస్ 'స్పైడర్' చిత్రాన్ని తమిళ్ వాళ్ళకి కావలసినట్టు తమిళ్ వెర్షన్, తెలుగు వాళ్ళకి కావలసినట్టు తెలుగు వెర్షన్ ని తెరకెక్కిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఏ మాత్రం హడావిడి లేకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మురుగదాస్.
ఇక ఇప్పుడు 'స్పైడర్' చిత్రంపై తమిళులకి కూడా విపరీతమైన ఆసక్తి కలుగుతుంది.... కారణం మురుగదాస్ వంటి డైరెక్టర్ మహేష్ ని దర్శకత్వం చెయ్యడం. అందుకే 'స్పైడర్' చిత్ర తమిళ హక్కులకు భారీ డిమాండ్ వచ్చిందని చెబుతున్నారు. ఆ డిమాండ్ అలాంటి ఇలాంటి డిమాండ్ కాదు ఏకంగా 'స్పైడర్’ తమిళ వెర్షన్ హక్కుల్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ 23 కోట్లు పెట్టి కొనుక్కుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఇంతకుముందే 'స్పైడర్' తమిళ హక్కుల్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ 18 కోట్లకి కొన్నట్టు వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ఏకంగా 23 కోట్లకి అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు.
ఈ విషయాన్ని స్పైడర్ పిఆర్ఓ అధికారికంగా ప్రకటించాడు. మరి ఇంత భారీ మొత్తంలో తమిళ హక్కులను కొనడం అంటే అది ఒక రికార్డ్ అంటున్నారు. మురుగదాస్ పై ఎంతగా అంచనాలు లేకపోతె ఇంత భారీ రేటుని లైకా సంస్థ పెడుతుందని అంటున్నారు. ఇక మహేష్ కి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ తమిళంలో లేదు... కానీ ఎక్కువమంది తమిళ స్టార్స్ ఎస్ జె సూర్య, భరత్ వంటి స్టార్స్ కూడా ఈ చిత్రం కీలక పాత్రలు పోషిస్తుండడం, రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ తో మొదటిసారి జోడికట్టడం వంటి అంశాలు స్పైడర్ కి తమిళ్ లో కలిసొస్తున్నాయి అంటున్నారు.