సినిమా వారినే డ్రగ్స్ కేసులో టార్గెట్ చేస్తున్నారని పలువురు చేస్తున్న వ్యాఖ్యలలో అర్ధం లేదు. మొదట మీరు...మొదట మీరు అని నిందించుకుంటూ కూర్చోంటే అసలు తొలి అడుగు ఎక్కడ పడాలి? ఎవరికి వారు ముందు రాజకీయాలను విచారించండి అని సినిమావారు, సినిమావారు బాగా పాపులర్ కాబట్టి వారి సంగతి మొదట చూడండి అని ఎవరికి వారు మరొకరి మీదకు నెడుతూ ఉంటే మొదటి అడుగు ఎక్కడ నుంచి వేయాలి? మరి కొందరు మీ అధికారులు, వారి పిల్లలే వాడుతున్నారు.
మొదట మీ సంగతి మీరే చేసుకోండి.........అంటున్నారు. ఒక ఉదుటున అందరినీ ఎవ్వరికి ఎవ్వరూ దేశవాప్తంగా దేనిని అరికట్టలేరు. అధికారులు మొదట ఈ విషయాన్ని సినీమా పరిశ్రమ నుంచి మొదలుపెట్టారు. ఎవ్వరినీ పట్టించుకోకుండా ఉండటం కంటే ఎవరో ఒకరి నుంచి దానిని ప్రారంభించినందుకు మన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని మనం సంతోషించాలి. ఇక సామాన్యంగా ఎవ్వరినీ విమర్శించిన ఆర్.నారాయణమూర్తి కూడా మా సినిమా వారే కనిపిస్తారా? అని ప్రశ్నించడం ఓ బాధ్యతాయుతమైన ఆర్.నారాయణమూర్తి గారికి తగదు.
స్కూళ్లకు వెళ్లే టీనేజ్ పిల్లలకి కూడా డ్రగ్స్ అందుతున్నాయంటే పరిస్థితిని తీవ్ర రూపాన్ని ఇది చూపిస్తోంది. మీకు మీ సినిమా వారి మీద అంత నమ్మకం ఉంటే.. వారందరినీ విచారించకండి....... వారు డ్రగ్స్ వాడినట్లు, లేదా సప్లై చేసినట్లు తెలిస్తే వారి తరపున నేను శిక్ష అనుభవించడానికి రెడీ అని ఆర్.నారాయణమూర్తి వంటి వారు సినిమా పరిశ్రమ తరపున వకాల్లా పుచ్చుకోగలరా? పిల్లి కళ్లు మూసుకుని.. అనే సామెత ఇప్పుడు అందరికీ తెలిసివస్తోందని భావించాల్సిఉంది.
సినిమా వారైపోగానే ఇక పబ్‌ల నుంచి అది సరఫరా కాకుండా చూడటం, టెక్కీలు, బడా బాబుల పిల్లలపై, ఇలా ఇది నిరంతరం కొనసాగే ఓ ప్రక్రియగా మారాలని ఆకాక్షించాలే తప్ప ఎవరికి వారు తమ పరువు పోతోందని దొంగ ఏడుపులు ఎందుకు పీపుల్స్‌స్టార్ గారూ....! కాస్తైనా ఆలోచించండి. ఈ విషయంలో తన మన సామధానదండోపాయాలన్నింటిని అధికారులు వాడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. వేయరా అడుగు అటు ఇటు ఎటో వైపు... మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి....వెనుక వచ్చు వారికి దారి అయినది.. అనేది వాస్తవం.