'బాహుబలి'తో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన యంగ్ రెబెల్ స్టార్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా యువి క్రియేషన్స్ బేనర్‌లో సుజీత్ దర్శకునిగా 150కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌కి దేశవాప్తంగా పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్నితెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో కూడా నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నీల్ నితిన్ ముఖేష్‌ని ఎంపిక చేసి ఆయనపై కొన్నిసీన్లు చిత్రీకరిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలో నటించడానికి మరో బాలీవుడ్ నటుడు చుంకీపాండే ఓకేచేశాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని అంటున్నారు. 1990దశకంలో చుంకీ పాండే 'తేజాబ్, ఆంఖే'చిత్రాల ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ని పండించడంలో తనదైన శైలిలో పోషించి గుర్తింపు పొందాడు. ఇక ఆయన చాలా కాలం గ్యాప్ తర్వాత తాజాగా వచ్చిన విద్యా బాలన్ 'బేగం జాన్'లో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ చిత్రం సరిగా ఆడకపోయినా చుంకీ పాండే నటనకు మంచి పేరొచ్చింది, దీంతో 'సాహో' మేకర్స్ ఓ కీలక పాత్ర కోసం చుంకీ పాండేని సంప్రదించడం ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి.
ఇక ఈ చిత్రం హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 'బిల్లా, మిర్చి, బాహుబలి-ది కన్‌క్లూజన్'లతో ప్రభాస్-అనుష్క జంటకు మంచి పెయిర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వారిద్దరు తిరిగి 'సాహో'లో కలసి నటించాలని, చివరకు వారు వివాహం చేసుకుంటే జంట చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు భావించారు. కానీ ప్రభాస్ ఈ చిత్రం కోసం సన్నబడి, బరువు తగ్గడం, అనుష్క బరువుగా ఉండటంతో ఆమెను మేకర్స్ వద్దనుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఓ జాతీయ పత్రిక కథనం ప్రకారం 'బాహుబలి' సమయంలోనే అనుష్క కొన్ని తమిళ ప్రాజెక్ట్స్‌ని ఓకే చేసిందని, 'సాహో'కి డేట్స్ ఇస్తే ముందుగా ఒప్పుకున్న చిత్రాలకు క్లాష్ వస్తుందని బావించిన అనుష్కనే ఈ చిత్ర మేకర్స్‌కి రెండు నెలల సమయం కావాలని, అంతలోపే అడిగితే తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పిందట.
ఇక ఇందులో దిశాపట్టాని,శ్రద్దాపూర్, కత్రినా కైఫ్ వంటి వారిపేర్లు వినిపిస్తున్నాయి.'బాహుబలి'కి ముందు ఆమెకు ప్రభాస్ సరసన చాన్స్ వచ్చినా ఆమె నో చెప్పిందని, కానీ 'బాహుబలి' తర్వాత మాత్రం ప్రభాస్‌తో చేయడానికి ఆమె చాలా ఉత్సాహం చూపుతోందని వార్తలు వస్తుండంతో 'సాహో' మేకర్స్ తాజాగా కత్రినాను మరోసారి సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.