Advertisementt

డ్రగ్స్ స్కాండిల్: తెరపైకి కాజల్ మేనేజర్..!

Mon 24th Jul 2017 09:10 PM
kajal agarwal,kajal agarwal manager,arrest,drugs scandal,charmi  డ్రగ్స్ స్కాండిల్: తెరపైకి కాజల్ మేనేజర్..!
Drug Scandal: Kajal's manager Roni arrested డ్రగ్స్ స్కాండిల్: తెరపైకి కాజల్ మేనేజర్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఒక పక్క నోటీసులు అందుకున్న వారిని సిట్ అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరో వైపు పోలీస్ లు డ్రగ్స్ కేసులో సంబంధం వున్నవారిని, వాడినవారిని, వాడుతున్న వారిని అరెస్ట్ లు చేస్తున్నారు. అయినా కూడా కొంతమంది డ్రగ్స్ కి ఎడిట్ అయినవాళ్లు ఈ అరెస్ట్ లకు కూడా భయపడంలేదనిపిస్తున్నది. సినిమా ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ మీదే ఫోకస్ అయ్యి వుంది. అయినా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇంకా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూనే ఉన్నారు. ఇక త్వరలోనే నోటీసులు ఇస్తారని చెబుతున్న సినీప్రముఖుల్లో ఒక టాప్ హీరోయిన్, టాప్ నిర్మాతల కొడుకులు, మరో ఇద్దరు యువ హీరోలు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. మరి కొంతమందికి వచ్చే వారం సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకుంది.

డ్రగ్స్ ఇంట్లో నిల్వ చేసి, వాటిని తీసుకుంటున్నాడని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని ఈ రోజు సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రోనీ ఇంట్లో గంజాయి నిలవ చేశాడని, అతను డ్రగ్స్ వాడుతున్నాడన్న సమాచారంతో అధికారులు రోనీ ఇంటిపై దాడి చెయ్యగా అక్కడ వారికి గంజాయి దొరికినట్లు చెబుతున్నారు. వెంటనే రోనీని అదుపులోకి తీసుకున్నారు. ఇక రోనీని పరీక్షించిన తర్వాత అతను డ్రగ్స్ వాడుతున్నాడా? లేకపోతే కేవలం డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడా? అనే దాని మీద అధికారులు ఒక కొలిక్కి వస్తారని తెలుస్తుంది. ఈ రోనీ ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి మేనేజర్. ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే రోనీ ఇంతకుముందు లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకు కూడా మేనేజర్ గా పనిచేశాడు.

మరి ఈ రోనీ అరెస్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా నివ్వెరపోయింది. ఇలా ఇంకెంత మంది డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యుంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మి సిట్ అధికారుల తీరు మీద హైకోర్టుకు వెళ్లి పిటిషన్ దాఖలు చెయ్యడం కోర్టు... సిట్ అధికారులు అకున్ సబర్వాల్, చంద్ర వదన్ లకు నోటీసులు ఇవ్వడం, చార్మీని కోర్టు సమక్షంలోనే విచారించాలని ఆదేశించడం జరిగింది. 

Drug Scandal: Kajal's manager Roni arrested:

In a new twist to the drug scandal in Tollywood, actress Kajal Agarwal's manager Roni was arrested

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ