Advertisementt

దేవసేన పాత్రలో మరో హీరోయిన్..!

Mon 24th Jul 2017 08:57 PM
actress karthika,aarambh serial,devasena role,star plus channel  దేవసేన పాత్రలో మరో హీరోయిన్..!
Actress Karthika in Aarambh Tv Serial దేవసేన పాత్రలో మరో హీరోయిన్..!
Advertisement
Ads by CJ

అలనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక సినిమాల్లో హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ మంచి ఛాన్స్ లు లేక క్రమేణా సినిమాలకు దూరమయ్యే పరిస్థితుల్లో ఆమెకు ఒక టాప్ టీవీ సీరియల్ లో అవకాశం వచ్చింది. ఆ అవకాశం అలాంటి ఇలాంటి అవకాశం కాదు. బాహుబలిలో దేవసేన పాత్ర ని బేస్ చేసుకుని ఇప్పుడు టీవీ ఛానల్ లో 'ఆరంభ్' అనే టివి సీరియల్ ఒకటి ఆరంభమైంది. బాహుబలిలో దేవసేనగా అనుష్క అదరగొట్టే పెరఫార్మెన్సు తో ఇరగదీసింది. మరి టీవీలో అలాంటి ఆఫర్ నే కార్తీక దక్కించుకుంది. బాహుబలి స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలిలో దేవసేన కేరెక్టర్ ని మరింత గొప్పగా చూపించడానికి ఈ సీరియల్ కి శ్రీకారం చుట్టాడు.

అయితే సినిమా అవకాశాలు లేక కార్తీక ఈ 'ఆరంభ్' లో దేవసేన పాత్రకి ఒప్పుకుందని అనుకుంటున్నారు అంతా. అయితే కార్తీక మాత్రం తనకు అవకాశాలు రాకపోవడం వలన సినిమాలు చెయ్యడం తగ్గించాను అనుకుంటున్నారేమో.... కాదు నేను సినిమాలు చేయకపోవడానికి కారణం మాత్రం ఈ  'ఆరంభ్' సీరియల్ అంటుంది. ఈ సీరియల్ కోసమే చాల సినిమాల ఆఫర్స్ వదులుకున్నాని చెబుతుంది ఈ భామ. ఇక ఈ ఆరంభ్ లో కార్తీక, దేవసేనగా అలరించబోతుంది. మరి అనుష్క అంత రాజసం రాలేదుగాని.... దేవసేన పాత్రలో కార్తీక కూడా పర్వాలేదనిపిస్తుంది. ఈ దేవసేన పాత్రలో కార్తీక కూడా కత్తి యుద్ధం, కర్రసాము, వీలు విద్య వంటివి నేర్చుకుంది. మరి సీరియల్ లో అయినా దేవసేన పాత్రని రాజసం ఉట్టిపడేలా... అందంగా చూపెడుతున్నారు. 

ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ బాహుబలిలో దేవసేన కి సంబందించిన కొన్ని విషయాలను కూలంకషంగా చూపెట్టలేకపోవడంతో ఈ సీరియల్ లో అవన్నీ అందరికి అర్ధమయ్యేలా చూపెట్టడానికే ఈ ఆరంభ్ సీరియల్ తీస్తున్నాడట. దేవసేన అందాలను ఆమె ప్రేమకథను ఆరంభ్ లోచూపబోతున్నారట. ఈ హిస్టారికల్ ఫాంటసీ డ్రామా గా వస్తున్న ఈ సీరియల్ ఈ వారమే స్టార్ ప్లస్ లో రానుందట.

Actress Karthika in Aarambh Tv Serial:

Actress Karthika acted in Tv serial 'Aarambh' this serial karthika Devasena role acted. Aarambh serial telecast this week in Star Plus channel.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ