Advertisementt

రకుల్ ప్రీత్ ది.. బలమైన క్యారెక్టర్..!

Mon 24th Jul 2017 07:13 PM
rakul preet singh,jaya janaki nayaka,boyapati srinu,spyder  రకుల్ ప్రీత్ ది.. బలమైన క్యారెక్టర్..!
Rakul Preet Singh Role in Jaya Janaki Nayaka రకుల్ ప్రీత్ ది.. బలమైన క్యారెక్టర్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఇప్పుడు ఫస్ట్ ప్లేసులో రకుల్ ప్రీత్ కొనసాగుతుంది. ఇండస్ట్రీలో చిన్న, పెద్ద స్టార్స్ అందరితో జోడి కట్టేస్తున్న రకుల్ ప్రీత్ మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. నటన రాకుండానే ఓన్లీ గ్లామర్ షో చేస్తూ రకుల్ టాలీవుడ్ లో దూసుకెళ్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మరి నటన రాకుండా టాప్ హీరోల సరసన మంచి కేరెక్టర్స్ అయితే పడవుగాని... ఈ మధ్యన రకుల్ ప్రీత్ నటన పరంగా కూడా బాగా కష్టపడుతుంది. అందులో భాగంగానే నాగ చైతన్యతో కలిసి నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’లో భ్రమరాంభగా రకుల్ మంచి మార్కులే కొట్టేసింది. 

ఈ సినిమాలో నటనకు రకుల్ ప్రీత్ సింగ్ కి ఫుల్ మార్కులే పడ్డాయి. ఇంకా రకుల్ నటిస్తున్న 'స్పైడర్, జయ జానకి నాయక' చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'జయ జానకి నాయక' చిత్రంలో రకుల్ క్యారెక్టర్ చాలా బలంగా వుంటుందట. ఈ విషయాన్నీ రకుల్ స్వయంగా చెబుతుంది. ఇంకా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ కాస్త మోడ్రెన్ గాను... ఇంకాస్త సాంప్రదాయకంగా వుంటుందట. కథలో వచ్చే ట్విస్టులకి అనుగుణంగా ఆమె కేరక్టర్ మారిపోతూ ఉంటుందట. అలాగే బోయపాటి శ్రీను ఈ చిత్రంలో కావాల్సినంత ఎమోషనల్ లవ్ ట్రాక్ ని పెట్టారని చెబుతుంది. 

మరి బోయపాటి ఈసారి కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి హిట్ ఇస్తాడని బలంగా నమ్ముతుంది. ఆల్రెడీ బోయపాటి రకుల్ కి 'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Rakul Preet Singh Role in Jaya Janaki Nayaka:

Rakul Preet Singh Revealed Her Character in Jaya Janaki Nayaka Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ