'పెళ్ళి చూపులు, క్షణం, శతమానం భవతి, నిన్నుకోరి' ఇలా మన సినిమాలు కూడా అద్బుతంగా రూపొందుతున్నాయి. కేవలం స్టార్స్, భారీ బడ్జెట్ చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తారనే విమర్శలను పక్కనపెడుతున్నాయి. మొన్నవారం 'నిన్నుకోరి' హవా సాగితే, ఈ వారం 'ఫిదా' ఊపూ సాగుతోంది. మొదటి షో నుంచే అద్భుతమైన టాక్ వచ్చింది. తొలివారం కలెక్షన్లు అదిరిపోవడం ఖాయమంటున్నారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ తర్వాత కూడా అందరూ జస్ట్ ఓకే అనుకున్నారు.
కానీ ఇంతటి అనూహ్య విజయాన్ని ఊహించలేదు. ఇక ఈ చిత్రం విడుదలకు ముందు పెద్దగా పేరులేని సంగీత దర్శకుడు, ఫేడవుట్ అయిన శేఖర్ కమ్ముల, కొత్తమ్మాయి సాయి పల్లవి, ఫ్లాప్‌లలో ఉన్న వరుణ్ తేజ్ ఇలా నడిచింది. కానీ ఈ చిత్రంతో వరుణ్ తేజ్, శేఖర్ కమ్ములతో పాటు మెయిన్‌గా సాయి పల్లవి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక ఈ చిత్రానికి మొదట 'ముసురు' అనే టైటిల్‌ని శేఖర్ కమ్ముల అనుకుని దిల్ రాజుకు చెప్పాడట. కానీ ఈ పదం పెద్ద పాపులర్ కాదని, ఎక్కువ మంది ఈ పదాన్ని వాడరని, కాస్త నెగటివ్ ఫీలింగ్ వస్తోందనిభావించిన దిల్‌రాజే దీనికి 'ఫిదా' అనే టైటిల్‌ను సూచించాడట.
ఇక క్లైమాక్స్‌లో హీరోయిన్ పరుగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకునే సీన్‌ని కూడా దిల్‌రాజే చెప్పి తీయించాడట. ఈ సీన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ చిత్రానికి సంగీతం, రీరికార్డింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి శాఖలన్నింటిలో పని చేసిన వారిని పేరు పేరునా పొగుడుతూ శేఖర్ కమ్ముల ఉద్వేగభరితమైన ట్వీట్స్ చేస్తున్నాడు. వరణ్‌ని అన్న, వదిన, తమ్ముడుతో పాటు సాయి పల్లవి అత్త పాత్ర చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి, సాయి చంద్... ఇలా అందరికీ ధ్యాంక్స్ చెబుతూ, ఈ చిత్ర నిర్మాణంలో రాళ్లేత్తిన అందరికీ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకరించిన అందరినీ ఆయన పేరు పేరునా మెచ్చుకుంటున్నాడు.
ఇక తెలంగాణను ఎంతో అందంగా చూపించావని అందరూపొగుడుతున్నారని, ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్‌కే చెందుతుందన్నాడు. ఇక వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తన స్నేహితులు కూడా తన గురించి కాకుండా సాయి పల్లవి గురించే ఎక్కువ మాట్లాడుతున్నారని,ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లోనే సాయి పల్లవి ఈ చిత్రంలో తనను డామినేట్‌చేయడం, ఇరగదీయడం గ్యారంటీ అని అనుకున్నానని అదే జరుగుతోందన్నాడు. నేటి హీరోయిన్లందరికీ సాయి పల్లవి వచ్చింది జాగ్రత్త..అన్ని చాన్స్‌లని ఆమె ఎగరేసుకుపోతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఇది నిజం, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్న వరుణ్ తేజ్ గ్రేట్ అనే చెప్పాలి.