మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడు శివాజీ రాజా సహజంగా సహనశీలి. కానీ ఆయన ఒక్కసారి కోపం వచ్చిదంటే చెలరేగిపోతాడు. సినిమాలలోని ఎందరో జీవితాలను ఆయన స్వయంగా చూశాడు. రాజేంద్రప్రసాద్‌ని ఆమధ్య లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. ఉదయ్ కిరణ్ మరణంపై స్పష్టంగా తన అభిప్రాయం చెప్పాడు. రంగనాథ్ నుంచి ఉదయ్ కిరణ్ వరకు వారు మరణించిన సమయంలో సినీ పెద్దలు చేసిన నిర్వాహకాలను బయటపెట్టాడు.
మరో వైపు తనను దూషించిన నటి తులసికి త్వరలో చుక్కలు చూపించనున్నాడు. కానీ ఆయన 'మా' అధ్యక్షునిగా ఉంటే ఆయన ఏం చేయగలడు? ఆయనేం గట్టిగా మాట్లాడగలడు? అని కొందరు అనుమానించారు. ఈ అనుమానాలను పట్టాపంచలు చేస్తూ తాజాగా టాలీవుడ్‌కి సెగ పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో తనదైన శైలిలో నిజాయితీగా స్పందిస్తున్నాడు. తాజాగా ఎక్సైజ్ అధికారులపై వర్మ చేసిన కామెంట్స్, అకుల్ సబర్వాల్‌ని మానవత్వం లేని వ్యక్తిగా, అమరేంద్ర బాహుబలిగా, 'బాహుబలిత్3'కి హీరోగా సరిపోతాడని, పబ్లిసిటీ కోసం సినిమా వారిని టార్గెట్ చేస్తున్నాడని, సినిమాలకు టీజర్లు, ట్రైలర్లలాగా ఎక్సైజ్‌శాఖకు హైప్ తెచ్చేందుకు అకుల్ ప్రయత్నిస్తున్నాడని వ్యంగ్యంగా చేసిన కామెంట్స్‌తో పోలీసులు, సిట్ అధికారులు ఈ కేసులో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఓ నిజాయితీ కలిగిన అధికారి తలుచుకుంటే ఏమి చేయగలడో అకుల్ చేసి చూపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ ఉద్యోగుల సంఘం వర్మని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో వర్మ వ్యాఖ్యలపై శివాజీ రాజా తీవ్రంగా తన వాయిస్ వినిపించాడు. జోకులు, సెటైర్లు, వ్యంగ్యాలు, తమాషాలు చేయడానికి ఇది సమయం కాదు. ఇది చాలా తీవ్రమైనది అదే సమయంలో సున్నితమైన సమస్య. వర్మ ఇండస్ట్రీకి చేసింది ఏమీ లేదు. ఆయనేదో తాను గొప్ప అని భావించి వ్యాఖ్యలు చేస్తే కేసు మరింత విషమించే అవకాశం ఉంది. ఆయన గత 10 రోజులుగా మాట్లాడని వ్యక్తి ఈ రోజే ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటూ పూరీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన వర్మకి పెద్ద కౌంటర్ ఇచ్చాడు.
ఆ బఫూన్‌పనులు మానుకుంటే బాగుంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు నేను ఇది చేశాను... అని ఆయనను చెప్పమనండి. నోటీసులు అందుకున్న వారికి, విచారణ చేస్తున్న వారికి మాత్రమే పూర్తి విషయాలు తెలుసు. ఎవరో కామెంట్స్ చేసినంత మాత్రాన దోషులు బయటకు రారు. నిర్ధోషులు దోషులు కారు. అసలు అధికారుల పనిలో వేలు పెట్టడానికి అతనెవరు? ఆయన సినిమా డైరెక్షన్‌లో ఎవరైనా ఉద్యోగులు వేలు పెడితే ఆయన ఊరుకుంటాడా? ఎవరి పని వారు చేయడం మంచిదని గట్టి కౌంటర్ ఇచ్చాడు.