Advertisementt

ఈ అమ్మడు పెళ్ళి మాత్రం చేసుకోదట.. కానీ..?

Sun 23rd Jul 2017 05:54 PM
actress ileana,bollywood movies,mubarakhan movie,ileana boy friend  ఈ అమ్మడు పెళ్ళి మాత్రం చేసుకోదట.. కానీ..?
Ileana D'Cruz Busy With Boyfriend and Mubarakan Film Promotions ఈ అమ్మడు పెళ్ళి మాత్రం చేసుకోదట.. కానీ..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కించుకుంటూ బాలీవుడ్ లో ఒక అవకాశం రాగానే అక్కడికి ఎగిరిపోయి బాలీవుడ్ సినిమాలే తన ఫైనల్ లక్ష్యమని సౌత్ ని నిర్లక్ష్యం చేసిన పిట్ట నడుము ఇలియానా ఇప్పటికి బాలీవుడ్ లో కాస్త స్థిరపడినట్లే కనబడుతుంది. అక్కడ ఇలియానా నటించిన రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. తాజాగా ఇలియానా నటించిన ముబారకన్ మూవీ వచ్చే శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఇల్లి బేబి పర్సనల్ లైఫ్ లోను తన బాయ్ ఫ్రెండ్ తో కూడా చెట్టాపట్టాలేసుకుని బిజిగానే గడుపుతుంది. కానీ పెళ్ళి మాత్రం అప్పుడే చేసుకోనని తెగేసి చెబుతుంది.

అయితే ఇలియానా సౌత్ సినిమాల్లో నటించేటప్పుడు ఒక తప్పు చెసిందట. అదేమిటంటే..  ఒకేసారి బోలెడు సినిమాలకు కమిట్ అవడంతో క్షణం తీరిక లేకుండా గడిపేదాన్ని. వేరువేరు సినిమాలు ఒప్పుకోవడం వలన ఒక సెట్ నుంచి మరో సెట్ కు పరుగులు తీయ్యాల్సి వచ్చేది. అలంటి పరిస్థితుల్లో సినిమాలను  సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయా... కానీ ఇప్పుడు బాలీవడ్ లో మాత్రం అలా కాదు అంటూ... బడాయిలు పోతుంది. ఇక సౌత్ లో చేసిన చాలా సినిమాలు తనకి మంచి పేరును తెచ్చిపెట్టాయని...నేను చేసిన గ్లామర్ రోల్స్ తనకెంతో నచ్చాయని చెబుతుంది. 

Ileana D'Cruz Busy With Boyfriend and Mubarakan Film Promotions:

Illeana Acted in Bollywood film 'Mubarakan' this movie release on comimg friday. And Illeana busy with boyfriend.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ