Advertisement

ఉపరాష్ట్రపతి..మోడీ వ్యూహమా..!

Sat 22nd Jul 2017 05:20 PM
narendra modi,vice president race,bjp,narendra modi strategy,venkaiah naidu  ఉపరాష్ట్రపతి..మోడీ వ్యూహమా..!
Narendra Modi's Strategy for Vice President ఉపరాష్ట్రపతి..మోడీ వ్యూహమా..!
Advertisement

రాష్ట్రపతి పదవి అధికార పార్టీకి లాంఛనమైంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది. ఎందుకంటే వెంకయ్య నాయుడు వంటి వారి పేరుని ఆయనకే తెలియకుండా ఈ రేసులో పెట్టడం చూస్తుంటే..ఇదంతా మోడీ వ్యూహమనే వినిపిస్తుంది. అయితే ఈ వ్యూహం మంచికా..! లేక దక్షిణాదిని దెబ్బ కొట్టేందుకా! అనేది మాత్రం ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య గెలిస్తే..మాత్రం నిజంగా ఇది ఉత్తరాది, దక్షిణాది సమతుల్యతకు చేసిందిగా అనుకోవచ్చు. లేదంటే మాత్రం దీని వెనుక బలమైన కారణం ఉందని కూడా చెప్పుకోవచ్చు. 

వెంకయ్య ఉపరాష్ట్రపతి అయితే..మోడీ వ్యూహం ప్రకారం..ప్రస్తుతం వినిపిస్తున్న ఉత్తరాది, దక్షిణాది సమతుల్యత కోసమే ఇలా చేసి ఉంటాడని భావించవచ్చు. అలాగే వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి..ఆ పదవికి అర్హుడు కాబట్టే..ఆయన ఇన్నాళ్లు బిజెపికి చేసిన సేవలకు గానూ.. ఈ అరుదైన గౌరవంతో సత్కరించారని భావించవచ్చు. 

వెంకయ్య ఉపరాష్ట్రపతి కాకపోతే..మోడీ వ్యూహం ప్రకారం..పైకి చాలా గంభీరంగా, గొప్పగా కనిపించే వెంకయ్య లోపల ఉన్న మనిషి వేరని చూపించడం కోసం అయ్యిండవచ్చు. వెంకయ్యనాయుడు ఆశ్రమాలపై వస్తున్న కొన్ని ఆరోపణల దృష్టా, అలాగే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో వెంకయ్య ప్రదర్శించిన చాకచక్యంని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వ్యక్తి మన ప్రక్కన ఉండటం మంచిది కాదనే..మోడీ ఇలాంటి వ్యూహం తీసుకుని ఉంటాడా..! ఏమో వీటన్నింటికి సమాధానం మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాతే తెలుస్తుంది. 

Narendra Modi's Strategy for Vice President:

India Prime Minister Narendra Modi's Strategy for Vice President Race.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement