తన కెరీర్‌లో ఎన్నడూ తీసుకోని గ్యాప్ తీసుకున్న యాక్షన్ హీరో గోపీచంద్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'గౌతమ్ నంద'పై ఇండస్ట్రీలోనే కాదు... బిజినెస్ సర్కిల్స్‌లో, ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం ట్రైలర్ చూసిన వారు ఈ చిత్రంలో గోపీచంద్ కనిపిస్తున్న అల్ట్రామోడ్రన్ గెటప్‌కి, చిత్రాన్ని లావిష్‌గా నిర్మించిన భగవాన్, పుల్లారావుల మేకింగ్ విలువలు తెగ ఆకట్టుకుంటున్నాయి. పాటలు కూడా ఇన్‌స్టాంట్ హిట్స్‌గా నిలిచాయి.
నిర్మాతలకు హీరో గోపీచంద్‌పై, దర్శకుడు సంపత్ నందిలపై ఉన్న నమ్మకం ఏమిటో ఈ చిత్రం ట్రైలర్ రిచ్‌నెస్‌ని చూస్తేనే అర్ధమవుతోంది. మరోపెద్ద హిట్ ఇవ్వడానికి గోపీచంద్, సంపత్ నందిని సిద్దమవుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రం ఈ నెల 28న గోపీచంద్ కెరీర్‌లోనే అత్యధిక స్క్రీన్లలో విడుదల కానుంది. ఇక ఇదే రోజున కృష్ణవంశీ 'నక్షత్రం' సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. కానీ 'గౌతమ్ నంద' ఊపు చూసిన కృష్ణవంశీతో పాటు నిర్మాతలు ఓ వారం వెనుకకు జరిగారు.
దాంతో 'నక్షత్రం' చిత్రం ఆగష్టు 4న విడుదల కానుంది. ఆరోజున విడుదల చేయాలని ముందు భావించిన రానా 'నేనే రాజు...నేనే మంత్రి' చిత్రం ఆగస్టు11కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక 'గౌతమ్ నంద'తో పాటు ఈనెల 28నే తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయాలని భావించిన ధనుష్ 'విఐపి2' రిలీజ్ కూడా వాయిదాపడింది.సో.. సోలోగా వచ్చి కలెక్షన్లను దుమ్మురేపడానికి 'గౌతమ్ నంద'గా గోపీచంద్ సంపత్ నందిని తోడు తీసుకుని రావడం ఖరారైంది...!