Advertisementt

అనసూయకి దానిపై ఇంట్రెస్ట్ పోయింది!

Fri 21st Jul 2017 08:13 PM
anasuya,jr ntr,bigg boss show,star maa  అనసూయకి దానిపై ఇంట్రెస్ట్ పోయింది!
Anasuya Gives Clarity on her Bigg Boss Entry News అనసూయకి దానిపై ఇంట్రెస్ట్ పోయింది!
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా అంతటా ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అనసూయని గాని, మంచు లక్ష్మిని గాని, తేజస్వి మదివాడని గాని, రేష్మీని గాని తెచ్చి బిగ్ బాస్ లో పెడుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. బిగ్ బాస్ షోకి వస్తున్న నెగెటివ్ టాక్ కి భయపడిన స్టార్ మా యాజమాన్యం ఈ షోకి హైప్ తీసుకురావడానికి గాను ఇలా ఎవరో ఒక సెలెబ్రిటీని షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టడానికి నానా తంటాలు పడుతుంది. అయితే ఈ షోకి అనసూయ అయితే ఇంకా ఎక్కువ క్రేజ్ వస్తుందని భావించి ఆమెను అప్రోచ్ అయినట్లు వార్తలొచ్చాయి.

అసలింతకు ముందే అనసూయ ఈ షోలోకి రాలేకపోతున్నందున ఫీల్ అవుతుందని అన్నారు కూడా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్స్ ని చూసి అనసూయ కూడా భయపడినట్లుంది.. అందుకే అప్పుడున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకుండా పోయింది. అయితే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంటర్ అవుతుందని వస్తున్న వార్తలకు అనసూయ క్లారిటీ ఇచ్చింది. తనకి బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేసే టైం ఎక్కడుందంటూ ఆమెపై వస్తున్న గాసిప్స్ ని కొట్టి పారేస్తోంది. తాను సినిమా షూటింగ్స్ తో, టివి షోస్ తో బిజీగా వున్నానని అందుకే ఆ షోకి వెళ్లే టైం లేదని చెప్పేసింది.

కేవలం ఎన్టీఆర్ వల్లనే ఈ  బిగ్ బాస్ షోకి క్రేజ్ వచ్చింది. మరి ఎన్టీఆర్ మాత్రం వారానికి రెండు రోజులు మాత్రమే ఆ షోకి క్రేజ్ తీసుకురాగలడు. కానీ మిగతా ఐదు రోజులు ఈ షోకి బజ్ తీసుకురావాలంటే మాత్రం ఎవరో ఒక టాప్ సెలెబ్రిటీ ఆ షోలోకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. 

Anasuya Gives Clarity on her Bigg Boss Entry News:

Anchor and Actress Anasuya Bigg Boss Wild Card Entry News is only Gossip

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ