టాలీవుడ్ దర్శకుల్లో గుణశేఖర్‌కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేమిటంటే ఆయనతో ఓ చిత్రం తీసిన నిర్మాత జన్మలో మరోసారి ఆయనతో సినిమా తీయడు. అనవసరంగా ఒరిజినల్ లోకేషన్స్‌ని వదిలేసి హీరోలను ప్రేరేపించి, నిర్మాతల చేత భారీ భారీ సెట్స్‌వేయిస్తుంటాడు. 'ఒక్కడు'లో చార్మినార్, 'అర్జున్'లో మధుర మీనాక్షి, 'మృగరాజు'లో ఆఫ్రికన్ అడవులు, 'చూడాలని ఉంది'లో కోల్‌కత్తా సెట్, ఇక 'వరుడు' సంగతి చెప్పడమే అనవసరం.
కొన్నిసార్లు ఓపెన్ లోకేషన్స్‌లో టాప్‌స్టార్స్‌తో సినిమా షూటింగ్ జరపడం కష్టమే. ఎందుకంటే ఆ హీరోలకున్న క్రేజ్‌తో సందర్శకుల సందడి ఎక్కువై ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టే రజినీకాంత్, సూర్య వంటి హీరోలు కూడా తమిళనాడులో తమకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో చెన్నైలో సముద్రపు ఒడ్డున తీయాల్సిన సీన్లను వైజాగ్‌లో తీస్తుంటారు.చెన్నై నగరంలో తీయాల్సిన షాట్స్‌ను హైదరాబాద్‌లో మేనేజ్ చేసేస్తూ ఉంటారు.
అంతేగానీ ప్రతి దానికి పనిగట్టుకుని కోట్లలో సెట్స్ వేయించడం వల్ల నేచురాలిటీ పోవడమే కాదు.. పలు ఆర్దిక భారాలు కూడా ఉంటాయి. ఇక హైదరాబాద్‌లోనే షూటింగ్ చేసేటప్పుడు ఆయా స్టార్స్ ఉండేది అక్కడే కాబట్టి సరైన సమయానికి రాకపోవడం, ఇతర ఇబ్బందులు ఉంటాయి. అదే ఔట్‌డోర్‌లో అయితే అందరూ పని మీదనే ద్యాస పెట్టి షూటింగ్ చకచకా చేసేస్తారు. అందులో సెట్స్ కంటే విదేశాలలో షూటింగే బెటర్ అని నిర్మాతలు కూడా ఒప్పుకుంటారు. ఇక మన గోదావరి జిల్లాల వాతావరణం కోసం త్రివిక్రమ్ ఊటీ, పొలాచ్చి వెళ్తుంటాడు.
ఇక సినిమాను చెక్కడంలో కూడా గుణశేఖర్‌ని విభిన్నశైలి. తాజాగా దర్శకుడు, క్రియేటివ్ జీనియస్‌గా పేరున్న సుకుమార్ కూడా అభినవ బాపూగా పేరున్న గుణశేఖర్ దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమద్య రామ్ చరణ్ 'రంగస్థలం 1985' కోసం గోదావరి జిల్లాలకు వెళ్లి మండుటెండల్లో, వానల్లో కూడా షూటింగ్ జరిపాడు. కానీ ఇప్పుడు ఏకంగా 5కోట్లు ఖర్చుపెట్టి ఈ చిత్రంలో వచ్చే గోదావరి ప్రాంతాల సీన్స్ కోసం సెట్ వేయిస్తున్నాడు. అదేదో పొలాచ్చి ఇంకా వీలుంటే ముందుగా జరిపిన గోదావరి ఒరిజినల్ లోకేషన్స్‌లో తీస్తే 5కోట్లు నిర్మాతలకు మిగిలేవి కదా..! అంటున్నారు.