Advertisementt

అల్లు శిరీష్ మరొకరిని లైన్‌లో పెడుతున్నాడు..!

Fri 21st Jul 2017 09:55 AM
allu sirish,allu aravind,allu arajun,mohan lal,suriya  అల్లు శిరీష్ మరొకరిని లైన్‌లో పెడుతున్నాడు..!
Allu Sirish Hopes on Tamil star Suriya అల్లు శిరీష్ మరొకరిని లైన్‌లో పెడుతున్నాడు..!
Advertisement
Ads by CJ

తెలుగు మెగాఫ్యామిలీ అండదండలున్నాయి. అన్న స్టైలిష్‌ స్టార్‌గా తెలుగుతో పాటు మలయాళంలో కూడా క్రేజ్‌ ఉంది. ఇక తండ్రి... మాస్టర్‌ బ్రెయిన్‌ ఆఫ్‌ టాలీవుడ్‌గా పేరొందిన అల్లుఅరవింద్‌ అండ ఉండనే ఉంది. దాంతో ఏకంగా ప్రకాష్‌రాజ్‌ నిర్మాతగా 'గౌరవం'తో పరిచయం అయ్యాడు. కానీ ఆడలేదు. తర్వాత ఊపులో ఉన్న యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతితో 'కొత్త జంట'తో అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ రెజీనా కంటే తక్కువ మార్కులు పడ్డాయి. 

ఆతర్వాత పరుశురామ్‌ చలవతో రొటీన్‌ అయినా సరే 'శ్రీరస్తు..శుభమస్తు'తో ఓకే అనిపించాడు. ప్రస్తుతం నిఖిల్‌కి పెద్ద హిట్‌గా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం ఫేమ్‌ వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో ఓ వెరైటీ సైన్స్‌ ఫిక్షన్‌లో నటిస్తున్నాడు. మధ్యలో తన సోదరుడు బన్నీ పుణ్యామా అని కేరళకి వెళ్లి అక్కడ ఇక్కడ తిరిగి నేనే మాలీవుడ్‌ అర్జున్‌ సోదరుడిని అని చాటుకొని వచ్చాడు. ఆ తర్వాత తండ్రి మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం మోహన్‌లాల్‌ హీరోగా మేజర్‌ రవి దర్శకత్వంలో '1975 బియాండ్‌ ది బోర్డర్స్‌'లో సపోర్టింగ్‌రోల్‌ చేశాడు. 

ఫలితం లేదు. ఇప్పుడు తమిళ స్టార్‌ సూర్య మీద పడ్డాడు. తనకు సూర్య అంటే భలే ఇష్టమని, ఈ నెల 23 న ఆయన పుట్టిన రోజు సందర్భంగా సూర్య ఫ్యాన్స్‌ అంతా ఆయన ఫొటోని డిస్‌ప్లేలో పెట్టుకుని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని సోషల్‌ మీడియాలో నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. మరి ఈ బుల్లోడి తపన అర్ధమై సూర్య తన చిత్రంలో కూడా ఓ సపోర్టింగ్‌రోల్‌ ఇచ్చి, తమిళంలో కూడా ఆయనకేమైనా చిన్న గుర్తింపునిస్తాడేమో చూడాల్సివుంది...! 

Allu Sirish Hopes on Tamil star Suriya:

Tamil star Suriya his birthday on 23rd of july, all the Suriya fans put his photograph on display and appealed to the netizens on social media to give him a happy birthday whishes.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ