డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇప్పుడు సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. అయితే ఆ 12 మందిని విడివిడిగా విచారించడానికి గాను డేట్స్ నిర్ణయించారు సిట్ అధికారులు. ముందుగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ సిట్ ముందు హాజరై డ్రగ్స్ విషయంలో వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాతి రోజు సిట్ అధికారులు నిర్ణయించిన డేట్ ప్రకారం విచారణకు హీరోయిన్ ఛార్మి హాజరవ్వాల్సి వుంది. కానీ ఛార్మి ప్లేసులో ఇపుడు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు సిట్ ఎదుట హాజరయ్యాడు. అయితే ఛార్మి ప్లేసులోకి శ్యామ్ కె. నాయుడు హాజరయ్యే సరికి అందరూ ఛార్మి హాజరు కాకపోవడానికి కారణమేంటంటూ తెగ చర్చించేసుకుంటున్నారు.
అయితే ఛార్మి సిట్ ఎదుట హాజరు కాకపోవడానికి కారణం ఆమె షూటింగ్ లో బిజీగా ఉందట. తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు గురువారం హాజరుకాలేనని ఛార్మి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆమె డేట్ ని మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఛార్మి డేట్ ని జూలై 26 కు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఛార్మి సిట్ ఎదుట హాజరు కాకపోవడానికి కారణం మాత్రం పూరీయే అంటున్నారు. ఎందుకంటే ఛార్మి, పూరికి బాగా క్లోజ్. పూరీనే కావాలని ఛార్మిని గురువారం విచారణకు వెళ్లకుండా ఆపినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సిట్ వద్దకు వెళ్లేముందు పూరీ జగన్నాధ్ ఈ విషయాన్ని ఛార్మికి చెప్పడంతో వెంటనే ఛార్మి అధికారులకు తాను గురువారం విచారణకు హాజరు కాలేనని చెప్పడంతో ఛార్మి ప్లేస్ లోకి శ్యామ్ కె నాయుడిని రప్పించారని అంటున్నారు.
అయితే విచారణలో ఛార్మి ఏ చిన్న విషయం బయటపెట్టినా ఇబ్బంది వస్తుందని భావించి పూరినే ఇలా చేశాడనే వార్తలు మాత్రం సోషల్‌మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. ఇక అధికారుల ముందు ఏయే ప్రశ్నలు ఏలా ఎదుర్కోవాలో కూడా పూరి ఛార్మికి ట్రైనింగ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.