ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా లో ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన బిగ్ బాస్ షో టెలికాస్ట్ ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ హోస్ట్ చెయ్యడం, షో పార్టిసిపేట్స్ ని హైక్ చెయ్యడం వంటి అంశాలతో బిగ్ బాస్ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ అదరగొట్టే వాక్చాతుర్యం, డాన్స్ వంటి అంశాలతో నిజంగానే ఫస్ట్ ఎపిసోడ్ కి మంచి మార్కులే పడ్డాయి. కానీ తర్వాతే వచ్చింది చిక్కల్లా... ఎందుకంటే ఆ తరవాతి రోజు ఎన్టీఆర్ కనబడకపోవడం, షో లో పార్టిసిపేట్స్ చేసేవారంతా... బిలో యావరేజ్ సెలబ్రిటీస్ అవడం... అసలు వారు షోలో నేచురల్ గా లేకపోవడం... వెరసి షోలో కూడా ఫుల్ గా నటింపచేయడం వంటి అంశాలతో అప్పుడే బుల్లితెర ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.
మరి షోకి కేవలం ఎన్టీఆర్ హోస్టింగ్ ఒక్కటే సరిపోదని గట్టి పార్టిసిపేట్స్ ఉంటేనే బిగ్ బాస్ షో 70 రోజుల పాటు సాగుతుందని... కేవలం ఇప్పుడున్న 14 మంది షోకి ఎటువంటి హైప్ తీసుకురాలేరని స్టార్ మా యాజమాన్యం భావిస్తోందట. అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరో ఒక స్ట్రాంగ్ మరియు పేరున్న సెలబ్రిటీ ని షోలోకి పంపేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయట. మొదట్లో బిగ్ బాస్ షోకి వస్తున్నారని ప్రచారం జరిగిన లక్ష్మి మంచు, తేజస్వినిలను షోలకి పంపేందుకు స్టార్ మా గట్టి ప్రయత్నాలే చేస్తుందట. కానీ ఒకే చోట 70 రోజులు అనేసరికి సెలబ్రిటీస్ ఎవరు ముందుకు రావడం లేదట. లక్ష్మి మంచు మాత్రం ఇంకా షో కొన్ని రోజులు పూర్తయ్యాకే వస్తుందని అంటున్నారు.
ఇక వారిద్దరూ కాకపోతే కనీసం హాట్ యాంకర్స్ అనసూయ అయినా లేకుంటే రష్మీ అయినా ఈ షో కి హెల్ప్ అవుతారని... వారిని కూడా సంప్రదించే పనిలో పడ్డారట షో నిర్వాహకులు. కానీ ఎవరూ వైల్డ్ కార్డు ఎంట్రిలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదట. ఎందుకంటే ఇప్పుడు షో జరుగుతున్న తీరుకు ఈ షో మీద అస్సలు క్యూరియాసిటీ లేకుండా పోవడమే అంటున్నారు. అస్సలు బిగ్ బాస్ షోలో ఉన్న 14 మంది పార్టిసిపేట్స్ షోకి ఎటువంటి క్రేజ్ తీసుకురాలేకపోతున్నారన్నది ప్రేక్షకులమాట. మరో రెండు మూడు రోజులకి ఈ షో.. జనాలకు మొహం మొత్తుతుందని అందుకే ఈలోపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరినో ఒకరి ఖచ్చితంగా తీసుకురావాలని స్టార్ మా సకల ప్రయత్నాలు స్టార్ట్ చేసిందట. మరి ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఈ బిగ్ బాస్ షోని రక్తికట్టిస్తే తప్ప ఎన్టీఆర్ బుల్లితెరమీద సేవ్ అయ్యే పరిస్థితి మాత్రం కనబడడం లేదు.