పవన్ కళ్యాణ్ ఇప్పుడు రొమాన్స్ మూడ్ లో ఉన్నాడట. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కుర్ర భామలతో రొమాన్స్ కి సిద్దమయ్యాడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లతో మొదటిసారి నటిస్తున్న పవన్ కళ్యాణ్... ఇప్పుడు ఈ ఇద్దరి భామలతో డ్యూయెట్ పాడుతున్నాడట. ఇప్పటి వరకు టాకీని తెరకెక్కించిన త్రివిక్రమ్ ఇప్పుడు పవన్, ఇద్దరు భామలతో తో డ్యూయెట్ ని చిత్రీకరిస్తున్నాడు. దీనికోసం చిత్ర యూనిట్ మొత్తం బల్గేరియా చేరుకొంది. అక్కడ దాదాపు 20 రోజుల పాటు ఈ పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది.
అయితే ఈ బల్గెరియా షెడ్యూల్ లో పవన్ ఇద్దరు హీరోయిన్స్ తో విడివిడిగా రొమాన్స్ చేస్తాడట. కీర్తి సురేష్ తో ఒక డ్యూయెట్, అను ఇమ్మాన్యువల్ తో మరో రొమాంటిక్ సాంగ్ ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడట. మరి ఈ మధ్యన త్రివిక్రమ్ హీరోయిన్స్ ని అవసరమున్నా లేకపోయినా హాట్ గా చూపిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాల్లో ఎన్ని ఎమోషన్స్ వున్నా త్రివిక్రమ్ మార్క్ రొమాన్స్ స్పెషల్ గా వుంటుంది. మరి ఈ చిత్రంలో పవన్ హీరోయిన్స్ తో ఎలాంటి రొమాన్స్ చెయ్యబోతున్నాడో గాని... త్రివిక్రమ్ మాత్రం హీరోయిన్స్ కీర్తిని, అనుని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే టాపిక్ ఇప్పుడు మొదలైంది.
అలాగే ఈ చిత్రంలో పవన్ ఇద్దరు హీరోయిన్స్ తో చేసే రొమాన్స్ మూవీకే హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నమాట.