తెలుగు సినీ చరిత్రలో అందరికీ కామన్‌గా అలవాట్లు ఉంటాయి. ఇది అన్ని రంగాలలోనూ ఉండేదే కానీ సినిమా రంగంలో ఎక్కువ మందికి మద్యం, సిగరెట్లు, స్త్రీల వీక్‌నెస్‌లు ఉంటాయి. అలా లేని వారిని సినీ పరిశ్రమ దేనికీ పనికిరానివారిగా కూడా చూస్తుంది. ఇక అలాంటి అలవాట్లేమీ లేని వారిలో శరత్, శేఖర్‌సూరి వంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇక శేఖర్ సూరి విషయానికి వస్తే యాడ్‌ఫిలింమేకర్ అయినా ఆయన 'అదృష్టం, ఎ ఫిలింబై అరవింద్, త్రీ, అరవింద్2, డాక్టర్ చక్రవర్తి' చిత్రాలు తీశాడు.
వీటిల్లో 'ఎ ఫిలిం బై అరవింద్' మాత్రమే బాగా ఆడింది. ఇక త్వరలో బాలీవుడ్‌లోకి సన్నిలియోన్‌ని పెట్టుకుని 'ఎ ఫిల్మ్‌బై అరవింద్'ని రీమేక్ చేస్తానని, సంజయ్‌దత్ కుమారుడితో తెరంగేట్రం చేయిస్తానని అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటస్ట్రింగ్ విషయం చెప్పాడు. తాను ఓ షూటింగ్‌లో ఉంటే ప్రముఖ ఇంగ్లీషు పత్రికకు చెందిన ఓ లేడీ జర్నలిస్ట్ ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందట. వస్తూనే సిగరెట్ వెలిగిచ్చి ఆయనకు ఆఫర్ చేసిందట. కానీ నాకు అలవాటు లేదు అని చెప్పడంతో కనీసం డ్రింక్ తీసుకుంటారా? అని ప్రశ్నిస్తే అది కూడా అలవాటు లేదు అని చెప్పాడట.
ఇండస్ట్రీలో ఇవ్వన్నీ కామన్ కదా..! మీరేంటి ఇలా..? అని ద్వందార్ధంతో మాట్లాడిందని చెప్పుకొచ్చాడు. ఇంకో సారి ఓ స్టోరీ చెప్పడానికి ఓ హీరోయిన్ ఉన్న గెస్ట్ హౌస్‌కి వెళ్లాడట. వెళ్లగానే ఆమె డోర్ మూసేసి సెక్స్ చేయగలవా? అని ప్రశ్నించిందట. మీ యూనిట్‌లోని వారందరూ నాతో సెక్స్ చేశారు. నువ్వొక్కడివే చేయలేదు. నీవు మగాడివా? నపుంసకుడివా? అని అడిగిందని, అందుకు తను మాత్రం ఒకరు ఎంజాయ్ చేసిన వారిని నేను ఎంజాయ్ చేయనని చెప్పినట్లు ఆయన వివరించాడు.