మంచి కథ దొరికితే రామ్‌చరణ్‌తో తన బేనర్‌లో ఓ చిత్రం చేస్తానని దిల్‌రాజు చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన అలా చెప్పాడో లేదో వెంటనే ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 'సినిమా చూపిస్త మావా' చిత్రంతో రాజ్‌తరుణ్ తో మంచి హిట్ కొట్టి, దిల్‌రాజు చూపులో పడి నాని హీరోగా 'నేను లోకల్' తీసి కాసుల వర్షం కురిపించిన దర్శకుడు.. త్రినాథరావు నక్కిన. తాజాగా ఆయన ఓ స్టోరీలైన్‌ని దిల్‌రాజుకు వినిపించాడట. ఈ స్టోరీలైన్ దిల్‌రాజుకి బాగా నచ్చడంతో ఆయన రామ్ చరణ్ కి స్టోరీలైన్ చెప్పే అవకాశం త్రినాధరావు నక్కినకి ఇప్పించాడని, ఈ స్టోరీ బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్దం చేసుకుని, బౌండెడ్ స్క్రిప్ట్‌తో రమ్మని ఆయనకు రామ్‌చరణ్ సూచించాడని అంటున్నారు.
కాగా ప్రస్తుతం త్రినాధరావు ఫుల్‌స్టోరీ కోసం తనకు సన్నిహితులైన కొందరు రైటర్స్‌తో కలిసి బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. మరోపక్క రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ వారి బేనర్‌లో 'రంగస్ధలం 1985'లో నటిస్తున్నాడు. దీని తర్వాత తన సొంత బేనర్ అయిన కొణిదెల బేనర్‌లో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి భాగస్వామ్యంలో కొరటాల శివతో చిత్రం ఓకే చేశాడు. మరోపక్క దిల్‌రాజు 'రాజా ది గ్రేట్', 'ఎంసీఏ', జనవరి నుంచి మహేష్‌బాబు-వంశీపైడిపల్లి చిత్రాలతో పాటు 'శ్రీనివాసకళ్యాణం'ను సాయి ధరమ్‌తేజ్‌తో చేయనున్నాడు.
ఇక రామ్‌చరణ్-త్రినాధరావు నక్కిన చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్దంలో మొదలవుతుందని అంటున్నారు.. కాగా గతంలో రామ్‌చరణ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చినా పట్టాలెక్కలేదు. చివరకు అదే సబ్జెక్ట్‌తో త్వరలో నానితో చిత్రం చేయనున్నాడు. కానీ త్రినాధరావు విషయంలో ప్లస్ ఏమిటంటే దిల్‌రాజు ఉండటమే. మరి ఇదైనా పట్టాలెక్కుతుందా? లేక నాని, రాజ్‌తరుణ్ వంటి వారి వద్దకు చేరుతుందా? అనేది ప్రశ్నార్ధకం..!