టాలీవుడ్ సెలబ్రిటీస్ లో డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్న12 మంది సభ్యులను సిట్ అధికారులు నేటి నుండి విచారించనున్నారు. మరి విచారణకు హాజరైన ఈ ప్రముఖుల్ని సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయనునున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు ఒక ప్రశ్నా పత్రం తయారు చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్ ని ఈ బుధవారం (19 వ తేదీ) ప్రశ్నించనున్న సిట్ అధికారులు ఈ కింది ప్రశ్నలనే అడుగుతారని అంటున్నారు. ఆ ప్రశ్నలివే..
1. డ్రగ్ డీలర్ కెల్విన్ తో ఎలా పరిచయం ఏర్పడింది.?
2. అసలు మీరంతా పార్టీలు బయట చేసుకోకుండా ఇంట్లోనే ఎందుకు చేసుకుంటారు?
3. అలాగే కెల్విన్, జిషన్‌లు ఇంటికి ఎందుకు వచ్చారు?
4. మీరు ఎన్ని రోజులుగా ఈ డ్రగ్స్ ని తీసుకుంటున్నారు(వాడుతున్నారు)?
5. మీరు కొకైన్(డ్రగ్స్) కావాలంటూ కెల్విన్ దగ్గరకి ఎవరిని పంపారు?
6. అలాగే నెలకు ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు?
7. కెల్విన్ ఈ డ్రగ్ మాఫియాలో లేక ముందు మీకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేసేవారు?
8. మీ ద్వారానే హీరోయిన్ ఛార్మి, ముమైత్‌ఖాన్, హీరో రవితేజ, సుబ్బరాజులకు ఈ డ్రగ్స్, కొకైన్ వెళ్లింది నిజమా, కాదా?
9. ఇక డ్రగ్స్ వాడిన తర్వాత కొద్దిరోజులు ఎందుకు హైదరాబాద్‌లో ఉండకుండా మాయమవుతున్నారు.?
10. ఇదంతా చూశాక మీరు బ్లడ్‌టెస్ట్‌కు సిద్ధమా? అలాగే మా దగ్గర ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏమిటి? అంటూ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ని ప్రశ్నించే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడుతున్నాయి. మే బి పైన చెప్పిన ప్రశ్నలనే పూరీని అడిగే అవకాశం 100 శాతం ఉందంటున్నారు.