దిల్‌రాజు ఈ ఏడాదిలో ఇప్పటికే 'శతమానం భవతి', 'నేనులోకల్', 'డిజె' హిట్స్‌తో హ్యాట్రిక్ కొట్టాడు. 'శతమానం భవతి, నేను లోకల్' విషయాలలో కాకపోయినా 'డిజె' కలెక్షన్ల విషయంలో మాత్రం బాగా నెగటివ్ ప్రచారం జరిగింది. వీటిని నిర్మాత దిల్‌రాజు తోసిపుచ్చాడు. ఫాల్స్‌ప్రిస్టేజీ కోసం కలెక్షన్లను పెంచి చెప్పడం, హిట్ కాకపోయినా హిట్ అని ప్రచారం చేసుకునే నిర్మాతని కాదని, మాలాంటి ప్రొఫెషనల్స్ చెప్పిన మాటలను కూడా అబద్దాలుగా చిత్రీకరిస్తే ఎలా? అని ప్రశ్నించారు. తానెప్పుడు రాంగ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వనని, ఆ అవసరం తనకి లేదని స్పష్టంచేశాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే పరిపక్వత నాకుంది. నేను మీడియా ముందుకొచ్చి మాట్లాడే ప్రతి మాటకు ఓ వ్యాల్యూ ఉంటుంది. అందుకే నేను రాంగ్ స్టేట్స్‌మెంట్స్ ఇవ్వనని తెలిపాడు.
'డిజె' పై నేను నిర్మాతగా ఎంతో హ్యాపీగా ఉన్నాను. సక్సెస్‌మీట్‌లోనే హ్యాట్రిక్‌మూవీ అని చెప్పాను, సినిమా తీయనప్పుడు నేను మాట్లాడను. 'డిజె' సినిమా బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. 'సరైనోడు'కి మించిన రెవిన్యూ వచ్చింది. దీని బట్టి ఇది నిజమా? కాదా? అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు. 'డిజె' విషయంలో అలా నెగటివ్ ప్రచారం ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదు. మాలాంటి నమ్మకమైన సంస్థలు హిట్ అని చెప్పినా అందులో తప్పులు వెతకడం భావ్యం కాదు. 'డిజె' విషయంలో జరిగిందే వేరే హీరోలకు కూడా జరుగుతుంది. ఈ విషసంస్కృతి మంచిదికాదు. వీటిని ప్రోత్సహించ వద్దని హీరోలు తమ అభిమానులకు చెప్పాలి.
ఇక డ్రగ్స్ విషయం నాకు తెలియదు. 'డిజె' రిలీజ్ తర్వాత నేను అమెరికా వెళ్లాను, ఇక్కడేం జరిగిందో నాకు తెలియదు. మంచి సినిమాకు ఎంత ఖర్చుపెట్టాలో ముందే ఆలోచిస్తాను. 'ఫిదా'కి అనుకున్న బడ్జెట్ కంటే 10శాతం ఎక్కువ ఖర్చయింది. అయినా మేమూహించిన రిజల్ట్ వస్తుంది. తెలంగాణకు చెందిన బాన్స్‌వాడకు చెందిన అమ్మాయికి, అమెరికాలో స్ధిరపడిన అబ్బాయిల మధ్య జరిగే కథ ఇది. పెళ్లిలో కలుసుకున్న వీరు తమ కోరికలను ఎలా నెరవేర్చుకున్నారనేదే ఈ కథ. శేఖర్‌కమ్ముల స్టోరీ చెప్పిన తర్వాత వరుణ్‌తేజ్ హీరో అని ఫిక్సయాం. ఇక హీరోయిన్‌గా సాయిపల్లవి బాగుంటుందని భావించాం. అప్పుడు ఆమె మెడిసిన్ చదువుతోంది. ఆమె కోసం ఆరునెలలు వెయిట్ చేశాం. తెలంగాణ యాస నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పింది.
శేఖర్ మంచి కథలు రాయలేడు గానీ మంచి సీన్స్ రాస్తాడు. అతనికి సరైన సమయంలో వస్తున్న చిత్రం ఇది. రామ్‌చరణ్‌తో చిత్రం చేయాలి. కథ ఓకే అయి హీరోగా వినిపించాల్సిన ప్రాసెస్ చాలా ఉంది. ఇక మహేష్‌బాబు-వంశీపైడిపల్లితో సినిమా సంక్రాంతికి మొదలవుతుంది. 'శ్రీనివాసకళ్యాణం' కూడా అప్పుడే మొదలవుతుంది. అక్టోబర్ 12న 'రాజా ది గ్రేట్', డిసెంబర్‌లో 'ఎంసీఏ' రిలీజ్ చేస్తామని దిల్ రాజు తెలిపారు.