Advertisementt

మరో వెరైటీ లుక్ లో బాహుబలి..!

Tue 18th Jul 2017 08:10 PM
prabhas,saaho movie,prabhas new look,uv creations,director sujeeth  మరో వెరైటీ లుక్ లో బాహుబలి..!
Prabhas Latest Photo Shoot మరో వెరైటీ లుక్ లో బాహుబలి..!
Advertisement
Ads by CJ

గత ఐదేళ్లుగా బాహుబలి లుక్ లోనే అదరగొట్టిన ప్రభాస్.... పెద్ద పెద్ద మీసాలతో, మంచి ఫిజిక్ తో ఒక రాజు అంటే ఇలానే ఉండాలి అనుకునేలా బాడీని పెంచి అభిమానులను, ప్రేక్షకులను అల్లరించిన ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సాహో కోసం పూర్తిగా తన గెటప్ నే చేంజ్ చేసేశాడు. మొన్నామధ్యన చాలా సన్నగా న్యూ లుక్ తో కనబడిన ప్రభాస్ ఇప్పుడు మరో వెరైటీ గెటప్ తో దర్శనమిస్తున్నాడు. ఆ ఫోటో లో ప్రభాస్ ని చూస్తుంటే భలే కామెడీగా కనిపిస్తున్నాడు.

వెరైటీ హెయిర్ స్టైల్ తో చాలా చిన్న గెడ్డంతో, సన్నని మీసకట్టుతో చిన్న స్మైల్ తో సిగ్గుపడుతున్న ప్రభాస్ ని చూస్తుంటే సాహో చిత్రంలో ప్రభాస్ ఇదే గెటప్ లో కనబడతాడా? అని అనిపిస్తుంది. మరి సాహో కోసమే ప్రభాస్ తన స్టైల్ ని ఇలా మార్చేడంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. అయితే ఇంత వరకు సాహో షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనలేదని తెలుస్తుంది. ఈ నెల చివరిలో ప్రభాస్ సాహో షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. గత నెలలోనే సెట్స్ మీదకెళ్ళిన సాహో చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ ఖచ్చితంగా ఇదే అంటూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి తర్వాత అమెరికా వెళ్లొచ్చాక ఒక లుక్ లో కనబడగా... ఇప్పుడు మరో లుక్ లో కనబడుతున్నాడు. అంటే సాహో కోసం ప్రభాస్ ఎలా వుండబోతున్నాడో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చెయ్యలేదు చిత్ర యూనిట్.

Prabhas Latest Photo Shoot:

Prabhas New Picture From Saaho Photo Shoot