Advertisementt

రవితేజ మదర్ మీడియా ముందుకొచ్చింది..!

Mon 17th Jul 2017 09:01 PM
raviteja,rajya lakshmi bhupatiraju,drugs,raviteja mother  రవితేజ మదర్ మీడియా ముందుకొచ్చింది..!
Raviteja Mom Rajya Lakshmi Bhupatiraju opens up on Drug issue రవితేజ మదర్ మీడియా ముందుకొచ్చింది..!
Advertisement
Ads by CJ

గత నెలలో రవితేజ తమ్ముడు భరత్ మద్యం సేవించి ఓ.ఆర్.ఆర్ మీద కార్ ఆక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని ఒక అనాథలా సాగనంపారు. కనీసం సోదరుడు రవితేజ కూడా భరత్ బాడీ ని చూడడానికి వెళ్లకపోవడమే కాకుండా అతని తల్లి తండ్రులు కూడా భరత్ ఆఖరి చూపుకు వెళ్లలేదు. ఈ విషయంపై మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. అయితే కేవలం భరత్ మీదున్న ప్రేమతోనే అప్పుడు ఆ పరిస్థితుల్లో భరత్ ని చూడడానికి వెళ్లలేకపోయామంటూ రవితేజ వివరణ ఇచ్చి.... ఇక ఈ విషయాన్నీ వదిలేశాడు. అయినా మీడియాలో ఏదో ఒక రకంగా ఈ న్యూస్ వస్తూనే వుంది. 

అయితే ఇప్పుడు రవితేజ డ్రగ్గిస్ట్ అంటూ అతని మీద నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంలో రవితేజ పేరును మీడియా ప్రముఖంగా  హైలెట్ చేస్తూ  గత నాలుగు రోజులనుండి ఊదరగొడుతుంది.  కానీ ఈ డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్నవారు చాలామంది తమ స్పందనను మీడియాతో పంచుకున్నారు. కానీ రవితేజ కనీసం సోషల్ మీడియాలో కూడా ఏవిధంగా స్పందించలేదు. అలాగే కనీసం నోటీసులు అందుకున్నట్టు కూడా చెప్పకుండా సైలెంట్ మెయింటింగ్ చేస్తున్నాడు.

కానీ డ్రగ్ కేసులో నోటీసు అందుకున్న ఇన్నాళ్ళకి రవితేజ తల్లి రాజ్యలక్ష్మి భూపతిరాజు గారు లైన్లోకొచ్చి తన కొడుకు రవితేజకి ఎటువంటి డ్రగ్స్ అలవాటు లేవని, కనీసం సిగరెట్ కూడా అలవాటు లేదని, తన కొడుకు చాలా మంచోడని అంటుంది. అలాగే తన చిన్న కొడుకు కూడా డ్రగ్స్ అలవాటు నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడని... కానీ ఈలోపే ప్రాణాలు కోల్పోయాడని చెబుతుంది.

చిన్న కొడుకు మరణించినప్పుడు బాధలో బాధ్యతను విస్మరించిన రాజ్యలక్ష్మి గారు ఇప్పుడు పెద్ద కొడుకు విషయంలో మాత్రం బాధ్యతగా మీడియాకి ఇంటర్వ్యూ లు గట్రా ఇస్తుందని... అంటున్నారు. ఎంతైనా కొడుకు ఫ్యూచర్ కి డ్యామేజ్ ఏర్పడుతుంటే ఏ తల్లి మాత్రం ఊరుకుంటుంది చెప్పండి. అందుకే రాజ్యలక్ష్మి గారు కూడా రవితేజ విషయంలో తన బాధ్యతని ఇలా చక్కబెట్టేరన్నమాట.

Raviteja Mom Rajya Lakshmi Bhupatiraju opens up on Drug issue:

Raviteja's mother Rajya Lakshmi Bhupatiraju spoke to a prominent channel related and informed press that Raviteja is never involved into drugs and he doesn’t even smoke. She also said, they haven’t got any notices from anyone.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ