ఎప్పుడెప్పుడు బుల్లితెర మీద ఎన్టీఆర్ ని చూద్దామా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా గ్రాండ్ లెవల్లో బిగ్ బాస్ షో ని ప్రారంభించింది. ఈ షో లో హోస్ట్ గా ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. చక్కాగా సూట్ వేసుకుని... నీట్ హెయిర్ కట్ తో క్లాస్ గా కనిపించినా లోపల మాస్ అలాగే ఉందంటూ అదరగొట్టే డాన్స్ తో ఇరగదీసేసాడు. సూపర్ వాయిస్ తో అదరగొడుతూ పార్టిసిపేట్స్ ని పరిచయం చేస్తూ అందరిని బిగ్ బాస్ హౌస్ లోకి స్వాగతం పలికాడు.
మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొన్నారంటే మొదటగా నటి అర్చన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవగా, తర్వాత సమీర్, ముమైత్ ఖాన్, సింగర్ మధు ప్రియ, నటుడు ప్రిన్స్, సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, నరసింహాచారి(సంపూ), హరితేజ, ధనరాజ్,ఆదర్శ్, శివ బాలాజీ, జ్యోతిలు ఉన్నారు. వీరందరూ తమ తమ టాలెంట్స్ ని చూపిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక వీరు 70 రోజుల పాటు ఆ హౌస్ లోనే గడపబోతున్నారు. మరి ఆ హౌస్ ఎలా ఉందంటే.... ఎంటర్ అవగానే సోఫాలు, స్విమ్మింగ్ ఫూల్ తో ఎట్రాక్టింగ్ గా ఉండగా.... కిచెన్, డైనింగ్ రూమ్, జిమ్, బెడ్ రూమ్స్, బిగ్ బాస్ రూమ్ వంటి సకల సదుపాయాలతో ఈ హౌస్ ని రెడీ చేశారు.
మరి ఈ హౌస్ లో ఈ పార్టిసిపేట్స్ ఎలా ఉండబోతున్నారు? ఈ 70 రోజులు వీరు ఎలా ఉండాలో బిగ్ బాస్ వాయిస్ ఓవర్ తో పరిచయం చేశాడు. ఇక ఎన్టీఆర్ మాత్రం గ్రేస్ ఉన్న వాయిస్ తో మొదటిసారి హోస్ట్ గా చేసినా.. ఎటువంటి అదురుబెదురు లేకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. మరి ఈ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ ని బాగానే హ్యాండిల్ చేశారు. ఇక మిగతా ఎపిసోడ్స్ లో పార్టిసిపేట్స్ బిహేవియర్ ఎలా వుండబోతుందో, ఈ సీజన్లో చివరి వరకు వీరిలో ఎంతమంది వుంటారో, ఎవరు విన్నర్ గా నిలబడతారో..చూద్దాం.