Advertisementt

దేవిశ్రీ లేని సుక్కు సినిమానా? కానీ తప్పదు!

Mon 17th Jul 2017 08:24 PM
sukumar,darshakudu,devisri prasad,sai karthik  దేవిశ్రీ లేని సుక్కు సినిమానా? కానీ తప్పదు!
Sai Karthik Music to Sukumar Darshakudu Movie దేవిశ్రీ లేని సుక్కు సినిమానా? కానీ తప్పదు!
Advertisement
Ads by CJ

ఒక్కో దర్శకునికి సంగీత దర్శకుడు నుంచి పలు శాఖలకు సంబంధించిన పలువురితో ర్యాపో ఉంటుంది. వారు తమకు బాగా ట్యూన్‌ అయిన వారినే ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు సుకుమార్‌- దేవిశ్రీప్రసాద్‌ల జోడీ కూడా ఒక్కటి. కాగా సుకుమార్‌ కేవలం తాను దర్శకత్వం వహించిన చిత్రాలకే కాదు... తాను నిర్మించిన చిన్న చిత్రమైన 'కుమారి 21ఎఫ్‌'కి కూడా దేవిశ్రీనే మ్యూజిక్ కి పెట్టుకున్నాడు. నిజానికి కాస్త అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం క్లాస్‌ ప్రేక్షకులని అలరించదన్న విమర్శల పరంపర తగ్గిందంటే అది కేవలం దేవిశ్రీ అందించిన క్లాస్‌ టచ్‌తోనే అని చెప్పకతప్పదు. 

ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఈమద్య దేవిశ్రీ బాగా బిజీ కావడంతో 'అఆ'కు మిక్కీజేమేయర్‌ని, పవన్‌ చిత్రానికి అనిరుధ్‌నిపెట్టుకున్నాడు. ఇక సుకుమార్‌ మాత్రం తాను దర్శకత్వం వహిస్తున్న రామ్‌చరణ్‌ మూవీ 'రంగస్థలం 1985'కి దేవిశ్రీనే పెట్టుకున్నప్పటికీ తాను నిర్మిస్తున్న 'దర్శకుడు'కి మాత్రం సాయి కార్తిక్‌ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. తాను అడిగితే దీనికి కూడా దేవిశ్రీ టైం ఇస్తానని చెప్పాడుగానీ అతని బిజీ, ఆయన్ను ఇబ్బంది పెట్టకుండా సాయికార్తిక్‌ వంటి ప్రత్యామ్నాయం కనిపించిందని సుకుమార్‌ అంటున్నాడు. 

తామిచ్చిన రూపాయికి వంద రూపాయల విలువైన నాణ్యమైన సంగీతాన్ని సాయి అందించాడని పొగడ్తలతో ముంచెత్తి, అతనికి థాంక్స్‌ చెప్పాడు. ఈ పాటలని విని రామచరణ్‌ కూడా బాగా ఇంప్రెస్‌ అయ్యాడని చెబుతున్నాడు. మొత్తానికి 'దర్శకుడు' చిత్రం హిట్టయితే ఇప్పటికే మంచి బిజిగా ఉన్న సాయికార్తిక్‌ రూపంలో తెలుగు పరిశ్రమకు మరో పెద్ద ఆప్షన్‌ దొరికనట్లే భావించాలి. విడుదలైన వెంటనే 'దర్శకుడు'లోని రెండు మూడు పాటలు బాగా శ్రోతలకు కనెక్ట్‌ అవుతుండటం చూస్తే ఈ చిత్రం మ్యూజికల్‌ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం కలుగుతోంది. 

Sai Karthik Music to Sukumar Darshakudu Movie:

Sukumar Darshakudu Movie without Devisri Prasad. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ