ఎప్పుడూ ట్విట్టర్ లో ఏదో ఒక హడావిడి చేసే రామ్ గోపాల్ వర్మా ఉన్నట్టుండి సైలెంట్ అయ్యాడు. ఆ మధ్యన ట్విట్టర్ ని వదిలేస్తున్నానంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రకంపనలు సృష్టించడం స్టార్ట్ చేశాడు.మరి షార్ట్ ఫిలిమ్స్ తో హడావిడి చేస్తున్న వర్మ సడన్ గా ఎన్టీయార్ బయోపిక్ తీస్తానంటూ రెండు తెలుగు రాష్ట్రాలకు నిద్ర లేకుండా చేశాడు. ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో రెండు రోజులు మీడియాలో హడావిడి చేసిన వర్మ... బాలకృష్ణ సైలెంట్ తో మూసుకుని కూర్చుకున్నాడు. అయితే ఇప్పుడు వర్మ ఏం చేస్తున్నట్టు. ఎన్టీఆర్ బయో పిక్ మీద నిజంగానే . బిజీగా ఉన్నాడా లేక ఇంకేదనా జరిగిందా.... అంటూ వర్మ ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు.
ఎందు కంటే ఇప్పుడు టాలీవడ్ అంతా డ్రగ్స్ మాఫియా లింకులతో అట్టుడికిపోతోంది. ఏ క్షణాన ఎవరు అరెస్ట్ అవుతారు. ఎవరికీ నోటీసు లు పంపిస్తారో అనే అనుమానంతో అనుక్షణం హడలి చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో వర్మ ఎటువంటి మెస్సేజ్ లు లేకుండా మౌనంగా ఉండడం అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. వర్మ కూడా డ్రగ్స్ వాసన తెలిసినవాడేనన్న వాదన ఒకప్పుడు ఫిలిం సర్కిల్స్ లో నడిచింది. ఈ డ్రగ్స్ గొడవలో తల దూర్చడం శ్రేయస్కరం కాదని సైలెంట్ అయిపోయాడా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లేదంటే ఎప్పుడు పనికిమాలిన విషయాల మీద కూడా సమర్థించడమో లేదా విమర్శించడమో చేసే అలవాటున్న వర్మ టాలీవుడ్ లో అతి పెద్ద ఇష్యు అయిన డ్రగ్ మాఫియా మీద మాట్లాడకుండా సైలెంట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదుమరి. అయితే వర్మ ట్విట్టర్ కి గుడ్ బై చెప్పాడుగా అందుకే స్పందించడం లేదేమోలే అనుకుంటున్నారేమో.. వర్మ స్పందించడానికి ట్విట్టర్ అక్కర్లేదు. ఏ విధంగానైనా ఆడేసుకుంటాడు.