క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తాను నిర్మించిన మొదటి చిత్రం 'కుమారి 2ఎఫ్' బాగా ఆడింది. దాంతో హరి ప్రసాద్ అనే తన సహచరుడు హరిప్రసాద్‌ని దర్శకునిగా పనిచేస్తూ 'దర్శకుడు' చిత్రం నిర్మిస్తున్నాడు. మరో పక్క చరణ్ హీరోగా మైత్రి మూవీస్ పతాకంపై 'రంగస్థలం 1985' అనే వినూత్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సో .. 'దర్శకుడు' ప్రమోషన్ కోసం ఆడియో వేడుకకు చరణ్‌ని గెస్ట్‌గా పిలిచి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాడు సుకుమార్.
తాను మొదట రామ్ చరణ్‌తో సినిమా అనే సరికి ఆయన మెగాస్టార్ చిరంజీవి కుమారుడు. ఆయన బర్న్ విత్ సిల్వర్ స్పూన్ కదా?. ఎలా మెయిన్ టెయిన్ చేయాలబ్బా? అని కంగారు పడ్డాను. కానీ రామ్ చరణ్ మట్టి మనిషి అని నాకర్ధమ్తెంది. గోదావరి షెడ్యూల్‌లో మేమంతా సన్‌లోషన్ క్రీమ్‌లు రాసుకుంటే, అతను పులిసిన పెరుగులో సున్నిపిండి కలుపుకుని రాసుకున్నాడు. అందరూ ఏదో పేస్ట్‌లు, లగ్జరీలతో చేస్తే ఆయన వేపపుల్లతో బ్రష్ చేసుకునే రకమని నాకర్ధమైంది.
ఆయన కాఫీలో బెల్లం కలుపుకుని తాగే బాబు అంటూ మాట్లాడాడు. ఇక డైరెక్టర్ హరి ప్రసాద్ జక్కా గురించి మాట్లాడుతూ, నేను మ్యాధ్స్ లెక్చరర్‌గా పనిచేస్తుంటే ఆయన ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆయన నాకో గూగుల్, అద్భుతమైన మెమరీ, నాకు హార్డ్ డిస్క వంటి వాడు. నాతో పాటు ఇక్కడికి వచ్చేశాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచాడు. '1'(నేనొక్కడినే)కి కథ అందించాడు. పలు కథలలో సాయం చేశాడు. కానీ ఎవ్వరి దగ్గర పనిచేయలేదు. కానీ ఈ 'దర్శకుడు' చిత్రాన్ని అద్భుతంగా తీశాడు అంటూ తన ప్రేమను చాటుకున్నాడు.