Advertisementt

పవన్‌ తప్పించుకున్నాడు..కానీ మహేష్‌కి మాత్రం!

Sun 16th Jul 2017 02:58 PM
mahesh babu,murugadoss,spyder movie,pawan kalyan,trivikram srinivasa,pspk25  పవన్‌ తప్పించుకున్నాడు..కానీ మహేష్‌కి మాత్రం!
GST Effect on Spyder Movie Producers పవన్‌ తప్పించుకున్నాడు..కానీ మహేష్‌కి మాత్రం!
Advertisement
Ads by CJ

ఒక్కోసారి కావాలని చేసినా, చేయకపోయినా కొన్ని విషయాలు కొందరికి కలిసి వస్తాయి కొందరికి మాత్రం దురదృష్టం కలిగిస్తాయి. అందుకే మనవారు ఎక్కువగా కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు. కేంద్రం కొత్తగా జీఎస్టీ పెట్టడంతో భారం పెరగనున్న సంగతి తెలిసిందే. కాగా పవన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఇంకా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఎందుకో నిర్మాతలు థియేటికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ బిజినెస్‌ కూడా చాలా తొందరగా క్లోజ్‌ చేశారు. 

కానీ వేసవికి విడుదల అవుతుందని భావించి, ఇప్పుడు దసరాకు పోస్ట్‌పోన్‌ అయిన మహేష్‌బాబు-మురుగదాస్‌ల 'స్పైడర్‌' నిర్మాతలు మాత్రం ఇంకా మంచి రేటు వస్తుందని, రెండో టీజర్‌ రిలీజ్‌ తర్వాత బిజినెస్‌ చేస్తే మరింత మంచి రేటు వస్తుందని భావించారట. కానీ అంతలో జీఎస్టీ రావడంతో సినిమా వ్యాపారం గుది బండగా మారుతుందనే భయంతో పెరిగిని ట్యాక్స్‌ దృష్ట్యా 'స్పైడర్‌'ని భారీ రేట్లకు కొనడానికి బయ్యర్లు భయపడుతున్నారని, దాంతో చాలా తక్కువ మొత్తంకు అడుగుతున్నారని తెలుస్తోంది. 

మొత్తానికి కావాలనిచేయకపోయిన త్రివిక్రమ్‌-పవన్‌కళ్యాణ్‌ చిత్రాల నిర్మాత కె.రాధాకృష్ణ సేఫ్‌ కాగా, 'స్పైడర్‌' నిర్మాతలైన ఠాగూర్‌ మదు, ఎన్వీ ప్రసాద్‌లకు మాత్రం కాస్త లాభాలు తగ్గడం ఖాయంగా కనిపిపిస్తోంది...! 

GST Effect on Spyder Movie Producers:

With GST, fears that the movie will become a band of business, it seems that the packers are scared to buy the 'spyder' for higher rates, and it is asking for a very small amount.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ