రామ్‌చరణ్ నటించిన 'మగధీర' చిత్రం చూసి, అందులోని షేర్‌ఖాన్ డైలాగ్‌ని ఓ బుడతడు హావభవాలతో సహా చెప్పే వీడియో ఒకటి నాడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దానిని చూసిన రామ్‌చరణ్ కూడా ముచ్చటపడి ఆ పిల్లాడి వివరాలు కనుకున్నాడు. అతని పేరు పరుశురాం అని మహబూబ్‌నగర్ జిల్లాలోని పల్లెటూరని, చాలా పేద కుటుంబమని, తల్లిదండ్రులిద్దరు గొర్రెల కాపరులని, ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువుకోవడంలేదని, ఏదో తెలియని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి పరుశురాంను రామ్ చరణ్ పిలిపించుకున్నాడు.
తాను చూసిన ప్రతి సినిమాలోని డైలాగులను ఆ బుడతడు ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా చెబుతుండటం చూసి ముచ్చటపడి చదువుకుంటావా? పెద్దయితే ఏం చేస్తావు? అడిగితే బుల్లి మగధీరనవుతానన్నాడు. ఆ పిల్లాడికి చరణ్ తాను ఆరెంజ్‌లో ధరించిన టీషర్ట్ ఇచ్చి బాగా చదువుకుంటే నేనే చదివిస్తా..... పెద్దయిన తర్వాత నేనే ఉద్యోగం ఇప్పిస్తా..నని చెప్పి, ఆ పిల్లాడి చదువు, ఆరోగ్యం విషయంలో తానే సాయం చేస్తానని చెప్పాడు.
దాంతో చిన్నారి పరుశురాంకి 'బాలధీర' అని, 'బుల్లిధీర' అనే పేర్లు కూడా కొందరు ముద్దుగా పెట్టేసుకున్నారు. కానీ చరణ్ సాయం ఏమైందో తెలియదు కానీ ఆ బుడతడు పాపం మరణించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి బిడ్డ వచ్చే జన్మలోనైనా భైరవుడిగా పుట్టాలని....అతని ఆత్మకి శాంతి చేకూరాలని... ఆ దేవుడిని కోరుకుందాం!