Advertisementt

పూరి బ్యాచ్ నే కావాలని టార్గెట్ చేసినట్లుంది!

Sat 15th Jul 2017 11:21 PM
puri jagannadh,puri camp,mumaith khan,drugs mafia  పూరి బ్యాచ్ నే కావాలని టార్గెట్ చేసినట్లుంది!
Puri Jagannath Company In Tollywood Drugs Scandal పూరి బ్యాచ్ నే కావాలని టార్గెట్ చేసినట్లుంది!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోని ప్రముఖ సెలబ్రిటీస్ పేర్లు బయటికి రాకపోయినప్పటికీ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పేరు మాత్రం డ్రగ్స్ మాఫియాతో ముడిపడి ఉన్నట్లు బయట పెట్టేశారు. ఇక పూరితో దగ్గర సంబంధం ఉన్నవారి పేర్లే బయటికి రావడం కూడా కాస్త ఆశ్చర్యం కలిగించే విషయాలే మరి. టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ.. శుక్రవారం మీడియాలో పలువురు సెలబ్రిటీస్ పేర్లు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బయటకి వచ్చిన పేర్లుతో పూరి కి దగ్గర సంబంధమే వుంది. ఈ 12 మంది పేర్లు బయటికి రావడం వెనుక ఎవరో కావాలనే పూరి జగన్నాధ్ బ్యాచ్ ని టార్గెట్ చేసినట్లే కనబడుతుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దలమని చెప్పుకునే పలువురు ఈ డ్రగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. కానీ ఆ టాప్ సెలబ్రిటీస్ పేర్లను బయటికి రానియ్యకుండా ఒక వర్గాన్ని టార్గెట్ చేశారని అంటున్నారు. పూరి తో దగ్గర సంబంధం వున్న రవితేజని, ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ ని, పూరి క్లోస్ ఫ్రెండ్ ఛార్మిని, అలాగే సుబ్బరాజు, రవితేజ కార్ డ్రైవర్ శ్రీనివాస్ వీళ్ళందరూ పూరి సన్నిహితులే అంటున్నారు. ఇకపోతే పూరి తెలుగు తెరకు ఐటెంతో పరిచయం చేసిన ముమైత్ ఖాన్ మాత్రం తనకి ఈ డ్రగ్ మాఫియాతో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తుంది.

ఆమె కూడా ఈ డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్నట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇది విన్న ముమైత్ ఒక వీడియో బైట్ ని బయటికి రిలీజ్ చేసింది. అందులో మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకుండా.. నన్ను దయచేసి బాధితురాలిని  చేయకండి. ఇలాంటి ఫేక్ న్యూస్ తో నన్ను ఎవరు ఏమి చేయలేరు. అసలు నాకు నోటీసులు వచ్చాయా లేదా అన్న విషయాన్నీ మీరు నాతో కన్ఫామ్ చేసుకుని ఏ న్యూస్ అయినా వేసుకోండి కాని.. ఇలా పిచ్చిపిచ్చిగా రాయకండి వీడియోలు వేయకండి అంటుంది. అసలు హైదరాబాద్ లో  సరదాగా రిలాక్స్ అవుదాం అని వస్తే ఇక్కడ నాకు భలే వెల్కమ్ చెప్పారులే ఈ న్యూస్ తో అంటూ మండిపడుతుంది.

ఇక మిగిలిన వారు నిన్ననే తమకి నోటీసులు రాలేదని కొందరు.... నోటీసులు వచ్చాయి విచారణకు హాజరవుతామని కొందరు చెప్పిన విషయం తెలిసిందే.

Puri Jagannath Company In Tollywood Drugs Scandal:

The whole of drug scandal shaking Tollywood from last couple of days has lion share of names hailing from Puri camp.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ