Advertisementt

వివాదం ముదిరి కేసుల దాకా వెళ్లేట్లుంది..!

Sat 15th Jul 2017 05:18 PM
tulasi,shivaji raja,maa president  వివాదం ముదిరి కేసుల దాకా వెళ్లేట్లుంది..!
Tulasi Responds on Shivaji Raja Tweets వివాదం ముదిరి కేసుల దాకా వెళ్లేట్లుంది..!
Advertisement
Ads by CJ

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే.. ఈ విషయం చూస్తే అర్ధమవుతుంది. 'శంకరాభరణం'లో బాలనటునిగా నటించి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న నటి 'శంకరాభరణం' తులసి ఇక అప్పుడెప్పుడో సీనియర్‌ నరేష్‌, సుమన్‌, భానుచందర్‌ వంటి వారి సరసన హీరోయిన్‌గా నటించింది. చాలా కాలం తర్వాత యంగ్‌ హీరోలకు తల్లిగా, వదినగా పాత్రలు చేస్తూ వస్తోంది. 

తాజాగా ఆమె ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ని కూడా కలిసి 'అమ్మా...నేను నీకున్నాననమ్మా' అనిపించుకుని కంటతడి పెట్టింది. దాంతో కాస్త వెలుగులోకి వచ్చింది. అదే తడవుగా 'శంకరాభరణం' తీసిన కె.విశ్వనాథ్‌, నిర్మించిన ఏడిద నాగేశ్వరావులను కూడా కాదని తానే 'శంకరాభరణం' అనే అవార్డులకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పింది. వేడుకకు ఎవ్వరూ స్టార్‌ విజేతలైన వారు రాలేదన్నది వాస్తవమే. కానీ ఆమె 'మా' అధ్యక్షుడైన శివాజీ రాజా మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. ట్విట్టర్‌లోనే కాదు.. బయట కూడా శివాజీ రాజానే స్టార్స్‌ని తన ఫంక్షన్‌కి రాకుండా అడ్డుకున్నాడని, ఆయనో బఫూన్‌, చీటర్‌ అంటూ విమర్శించింది. 

అయినా శివాజీ రాజా మౌనంగానే ఉన్నాడు గానీ స్పందించేలేదు, లేటయినా కూడా లేటెస్ట్‌గా ఆయన తన లాయర్లతో కలిసి తులసి పై పరువు నష్టం కేసు వేయడానికి రెడీ అవుతున్నాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్న తులసి తాను శివాజీ రాజాని ఏమీ అనలేదని, ఆ ట్విట్టర్‌ అకౌంట్‌ ఎవరో సృష్టించినదని, కావాలంటే పరిశీలించుకోవచ్చని అంటోంది. కానీ ఆమె చేసిన ఈ ట్విట్టర్‌లోని ట్వీట్‌ డిలేట్‌ అయి ఉంది. దీంతో ఈ వివాదం మరింత పెద్దదవుతుందా? లేక ఎన్టీఆర్‌ వంటివారు తులసిపై ఉన్న అభిమానంతో రాజీ చేస్తారో వేచిచూడాల్సివుంది....! 

Tulasi Responds on Shivaji Raja Tweets:

Speculations are buzz that Shivaji Raja is planning to file a defamation case against  teh actress for making insulting remarks and taking an action against her as MAA President. Finally Tulasi  took the twitter to give her clarification on insulting remarks. According to  her,  the disrespectful remark which had been posted,  doesn’t belongs to her.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ