రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసన అపోలో గ్రూప్ ఫౌండేషన్‌ని నడుపుతోంది. సినిమా వ్యవహారాల కంటే ఆమె ఎక్కువగా ఈ ఫౌండేషన్‌కే సమయం కేటాయిస్తుండటంతో ఆమెను పలువురు తెగ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ ఫౌండేషన్ తరపున ఉపాసన మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో యువతలో ఎన్నో కొత్త కొత్త ఐడియాలు, వ్యాపారాలు చేసే తెలివితేటలు, తాము స్వయం ఉపాధి పొందడమే కాకుండా పది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించే ఐడియాలు పుష్కళంగానే ఉన్నాయి.
కానీ వాటిని సాకారం చేసుకునేందుకు వారి వద్ద పెట్టుబడి ఉండదు. దాంతో బాగా ఆలోచించిన ఉపాసన తెలివితేటలు, కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు, వాటిని నిజం చేసే టాలెంట్ ఉంటే తమ ఫౌండేషన్‌కి తెలపాలని, వాటికి పెట్టుబడి పెట్టి తాము ఆ కలలను సాకారం చేస్తామని చెప్పింది. ఇదంతా వింటుంటే మనకు 'పెళ్లి చూపులు' చిత్రం గుర్తుకు రావడం ఖాయం. ఇక ఉపాసన మామయ్య ఆనాడు నటించిన 'చాలెంజ్' సినిమా కూడా జ్ఞాపకంవస్తుంది.
ఇక దీనికి ఉపాసనకు ఎక్కడలేని విపరీతమైన స్పందన వచ్చిందట. ప్రకటించిన తక్కువ రోజుల్లోనే దాదాపు 3వేల ఈమెయిల్స్ వచ్చాయట. వాటిలో ఎక్కువ శాతం ఐడియాలు ఎంతో సూపర్బ్‌గా ఉన్నాయని ఉపాసన సంతోషం వ్యక్తం చేస్తోంది. త్వరలో వాటికి కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని, ప్రస్తుతం మొదటగా నేటి జనరేషన్‌కి తగ్గ కొన్ని బిజినెస్‌లను ముందుగా ఎంపిక చేసి, వాటి ఐడియా దారులతో వాటిని ప్రారంభించింపజేసి ఫలితాలు ఎలా ఉంటాయో ప్రాక్టికల్‌గా పరిశీలించడానికి రెడీ అవుతోంది. మొదట బిగిన్ చేసే బిజినెస్ ఐడియాలే క్లిక్ అయితే ఇక ఈ అమ్మడు నేటి నిరుద్యోగయువత పాలిట దేవతగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కీపిటప్.. ఉపాసన...!