ఇప్పుడు ఎక్కడ చూసినా కోలీవుడ్ లో ప్లాప్ మూటగట్టుకున్న బిగ్ బాస్ షో ఇక్కడ తెలుగులో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో అని ఒకటే చర్చ. ఎన్టీఆర్ హోస్ట్ అయితే అయ్యాడు గాని అందులోని పార్టిసిపేట్స్ ఎలా వుండబోతున్నారో అనే క్యూరియాసిటీ రోజురోజుకి పెరిగిపోతుంది ప్రేక్షకుల్లో. ఆ ఉత్కంఠ ఎలా వుంది అంటే బిగ్ బాస్ షో ఈ నెల 16 న స్టార్ మాలో ప్రచారం అయ్యేవరకు కూడా ఆగేలా లేరు జనాలు. ఒకపక్కన ఎన్టీఆర్ హోస్ట్ అంటూ ఫుల్ క్రేజ్ లో ఉంటే.. మరోవైపు పార్టిసిపేట్స్ ఈ షోలో ఎలా బిహేవ్ చేస్తారో అనే ఫీలింగ్ తో బిగ్ బాస్ ఫీవర్ పిచ్చెక్కిస్తుంది అందరికి.
అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనబోయే పార్టిసిపేట్స్ వీరే అంటూ ఎవరి ఊహకి వారు చెప్పేసుకుంటున్నారు. కానీ అందులో ఎవరు ఫైనల్ అనేది ఇంకా ఎవ్వరికి తెలియదు. ఇకపోతే బిగ్ బాస్ రియాలిటీ షోలో రచ్చ రచ్చ చేసేది వీరే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఊహించి తయారు చేసిన బిగ్ బాస్ పార్టిసిపేట్స్ లిస్ట్ ఇలా వుంది. ముమైత్ ఖాన్, మంచు లక్ష్మి, సీనియర్ హీరోయిన్లు రంభ, స్నేహ, సదా, యాంకర్ శ్రీముఖి, తేజస్వి మదివాడ వీళ్ళందరూ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోతున్నారంటూ తెగ ప్రచారం జరుగుతుంది.
మరి మంచు లక్ష్మి, ముమైత్ ఖాన్ లాంటి ఫైర్ బ్రాండ్స్ బిగ్ బాస్ హౌస్ లో 70 రోజులు కలిసి ఉంటే.. ఇక బిగ్ బాస్ కి కావాల్సినంత ఫన్ అండ్ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక రంభ, సదా, స్నేహా, శ్రీముఖి, తేజస్వి లాంటి హాటీస్ గ్లామర్ కూడా యాడ్ కావడంతో బిగ్ బాస్ షోకి క్రేజ్ పెరగడం ఖాయం అంటున్నారు. నిజంగా వీళ్ళే గనక బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేస్తే నిజంగానే ఈ షో సక్సెస్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం ఉండదంటున్నారు.