దిల్‌రాజుకు సినిమాలపై మంచి కమాండ్ ఉంది. ఆయనకు సినిమాకు సంబంధించిన ప్రతి శాఖలోనూ పట్టుంది. ముఖ్యంగా ఎడిటింగ్, ప్రమోషన్లలో ఆయన సిద్దహస్తుడు. ఎక్కడైనా సీన్ లాంగ్ అయి బోర్‌గా ఉంటే వెంటనే నిడివి తగ్గించేందుకు ఎడిటర్ కంటే ముందే కత్తెర రెడీ చేస్తాడు. ఇక ఆయన మెంటాలిటీకి మన క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పూర్తి విరుద్దం. ఫీల్‌గుడ్ చేయడానికి ఆయన ఏదైనా సీన్‌నైనా సరే రెండు నిమిషాలలో చెప్పేదాన్ని విడమర్చి చెప్పేందుకు 20 నిమిషాలు తీస్తాడు.
కానీ ఇప్పుడు శేఖర్ కమ్ముల ఆటలు సాగవు. ఎందుకంటే ఆయన అసలే ఫ్లాప్‌లలో ఉన్నాడు. డిమాండ్ చేయలేడు. అందునా ఎదురుగా కొమ్ములు తిరిగిన ఉస్తాద్ దిల్‌రాజు ఉన్నాడు. దాంతో ఆయన వరుణ్‌తేజ్ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా తీసిన 'ఫిదా' త్వరలో థియేటర్లలకు రానుంది. దీనికోసం ఏకంగా 25 నిమిషాల నిడివి కలిగిన సీన్స్‌ని దిల్‌రాజు కత్తిరించే పారేశాడట. అసలే సెన్సిటివ్ మైండ్‌తో పాటు సెన్సిటివ్ డైరెక్టర్ కూడా అయిన శేఖర్ కమ్ముల జీ..హుజూర్ అని దిల్‌రాజు కు సలాం చేయడం మినహా ఏమీ చేయలేకపోయాడట.
ఇక ఈ చిత్రం శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్, సాయి పల్లవిలకే కాదు.... దిల్ రాజుకి కూడా కీలకమే. 'డిజె'తో ఓవర్‌సీస్ రైట్స్ తీసుకున్న తన ఆప్తుడైన డిస్ట్రిబ్యూటర్‌కి వచ్చిన నష్టాలను ఆయన 'ఫిదా'తో తీరుస్తానని మాట ఇచ్చాడు. ఇక ఇది కూడా ఆడకపోయినా ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూటర్ హాయిగానే ఉండవచ్చు. ఎందుకంటే తర్వాత విడుదయ్యే నాని 'ఎంసీఏ'ను అతనికే ఇస్తాడు. ఎలాగూ నానికి ఓవర్‌సీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.