ప్రవీణ్ సత్తార్.. ఈ దర్శకుడిలో కాస్త విషయం ఉంది. 'చందమామ కథలు' వంటి చిత్రానికి రివ్యూరైటర్లే కాదు.. విమర్శకులు ప్రశంసలు, అవార్డులు కూడా వచ్చాయి. కానీ కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయి ఉండకపోవచ్చు. కానీ దాంతో ఆయన ఏకంగా 'గుంటూరు టాకీస్'ని తీసినప్పుడు మాత్రం అందరూ ఆయన్ను ఏకేశారు. కానీ 'చందమామ కథలు'లో తనను మెచ్చుకున్నవారు, 'గుంటూరు టాకీస్'తో ఎందుకు విమర్శించారనే ఆలోచన లేకుండా ఆయన మీడియాతో పాటు విమర్శకులని నానా మాటలు అనేశాడు.
కాగా ప్రస్తుతం ఆయన రాజశేఖర్ హీరోగా, 'విశ్వరూపం' ఫేమ్ పూజా కుమార్‌తో పాటు సన్నిలియోన్‌ని దింపి ఏకంగా 'పి.ఎస్.వి. గరుడు వేగ 126.18ఎమ్' టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. అసలే రాజశేఖర్ మీద ఏకంగా 25కోట్ల బడ్జెట్ పెడుతున్నారని విని మొదట అందరూ జోక్ అనుకున్నారు. కానీ నిర్మాతతో పాటు రాజశేఖర్ కూడా దానిని దృవీకరించాడు. తనపై 4,5కోట్లే బిజినెస్ జరగని పరిస్థితుల్లో ఏకంగా 25 కోట్లు బడ్జెట్ పెట్టడం తనకే ఆశ్చర్యం కలిగిస్తోందని రాజశేఖర్ నిజాయితీగా ఒప్పుకున్నాడు.
మరి ఎంత కథ డిమాండ్ చేసినా ఇంత బడ్జెట్‌ను ఏ నమ్మకంతో పెడుతున్నారు? ఎలా బిజినెస్ అవుతుందని డేర్ చేస్తున్నారు? సినిమాను ఏమి ప్రమోట్ చేసి థియేటర్లకు తెప్పిస్తారు? ఏకంగా 25 కోట్ల షేర్‌ని ఎలా రాబడుతారనేది? అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ చిత్రానికి కథ రీత్యానే బడ్జెట్‌పెట్టామని, దీంతో నేనేం పెద్ద దర్శకుడిని అయిపోలేదని, చిన్న బడ్జెట్‌లో చేసే సబ్జెక్ట్ ఉంటే చిన్న బడ్జెట్‌లో కూడా సినిమా తీస్తానంటున్నాడు ప్రవీణ్ సత్తారు.
ఇక ఆయన తదుపరి మహేష్ బావ సుధీర్‌బాబుతో కూడా భారీ బడ్జెట్, హాలీవుడ్ నుంచి మేకప్ మేన్‌లను, సాంకేతిక నిపుణులను తెచ్చి తెలుగు, హిందీ భాషల్లో పుల్లెల గోపీచంద్ బయోగ్రఫీని తీయనున్నాడు. స్క్రిప్ట్ పూర్తయిన ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్టే అంటున్నారు. ఇక గరుడ కథను ప్రవీణ్ 10ఏళ్లకు ముందే రాసుకున్నాడట. నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఏర్పడలేదు. ఏమిటో అంతా గందరగోళంగా ఉంది..!