దర్శకునిగా శేఖర్ కమ్ముల టేస్ట్ పై నమ్మకం ఉన్నప్పటికీ 'లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక' చిత్రాలతో చెడ్డపేరు తెచ్చుకున్నాడు. దాంతో ఆయన విజయాలలో నిలకడ లేదని, ఏది హిట్టవుతుందో, ఏది ఫట్టవుతుందో ఎవ్వరూ ముందుగా చెప్పలేరనే విమర్శలు వచ్చాయి. ఇక నిర్మాతగా కూడా 'ఆవకాయ్ బిర్యానీ' పెద్ద దెబ్బే వేసింది. ఇక ఓ హిందీ రీమేక్‌ని నమ్ముకుని 'అనామిక'ను ఆయన చేయడం చూసి, శేఖర్ కమ్ములకు కూడా భావ దారిద్య్రం వచ్చిందనే సెటైర్లు వినిపించాయి.
ఇక ఆయన మొదటి చిత్రం 'ఆనంద్'కి ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనే క్యాప్షన్ పెట్టాడు. అది బాగా వర్కౌట్ అయింది. దాంతో అందరూ సినిమా టైటిల్స్‌కు తోకగా క్యాప్షన్లు పెట్టే ట్రెండ్‌కి పెద్దపీట వేసిన ట్రెండ్‌సెట్టర్ మాత్రం కమ్ములనే. ఇక ఆయన తాజాగా దిల్‌రాజు నిర్మాతగా, మెగాహీరో వరుణ్‌తేజ్, సాయి పల్లవిలతో 'ఫిదా' అనే హృద్యమైన ప్రేమ కథను తెరకెక్కించాడు.
రిలీజ్‌కు దగ్గర పడుతున్న ఈ చిత్రం పెద్దగా ఎవ్వరినీ ఆకర్షించలేదు. కానీ ఆడియో వేడుక తర్వాత అంచనాలు పెరిగాయి. ఓ ఎన్నారై యువకునికి, తెలంగాణ అమ్మాయికి మద్యలో ఏర్పడే ప్రేమ కథను ఎంతో సున్నితంగా, మనసులను తాకే విధంగా శేఖర్ తెరకెక్కించాడనే పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక 'ఆనంద్' ఓ మంచి కాఫీ లాంటి చిత్రమైతే, 'ఫిదా'ఓ ఖుషీ లాంటి చిత్ర మంటూ దిల్‌రాజు ప్రమోషన్ మొదలుపెట్టాడు.
అంటే ఈ చిత్రం పవన్‌కి 'ఖుషీ'లా వరుణ్‌కి 'ఫిదా' అవుతుందన్నా? లేక ప్రేక్షకులకు ఖుషీ, జోష్‌ని నింపే చిత్రమ అనేది అర్దం కావడంలేదు ఇంకా దిల్‌రాజు మాట్లాడుతూ, యువ హీరోలు స్టార్స్‌గా ఎదిగే క్రమంలో వచ్చే ప్రేమ కదా చిత్రాలు మంచి బ్రేక్‌నిస్తాయని, పవన్‌కి 'సుస్వాగతం, తొలిప్రేమ', బన్నీకి 'ఆర్య' అలాంటివే అంటున్నాడు. మరి రామ్ చరణ్ 'ఆరెంజ్' ఫలితం దిల్‌రాజు మర్చిపోయాడేమో అనిపిస్తుంది...!