తమిళ 'బిగ్‌బాస్'షో ద్వారా తమిళుల మనోభాలను దెబ్బతీస్తున్నాడని, దీనితో హోస్ట్ కమల్ హాసన్‌తో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నవారిని కూడా అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్లలో కేసులు, హైకోర్టులో పిటిషన్లను హిందూ మకల్ కట్చి వారు వేశారు. దీనిపై కమల్ మండిపడ్డాడు. 30ఏళ్లకు పైబడిన కెరీర్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదనేవి తనకు తెలుసునని వ్యాఖ్యనించాడు. 'దశావతారం' నుంచి 'విశ్వరూపం' వరకు నాపై కక్ష్య తీర్చుకుంటున్నారు అని ఆగ్రహించాడు, అమీర్ ఖాన్‌లాగా మీరు కూడా 'సత్యమేవజయతే' చేయవచ్చు కదా..! అని అడిగితే అలాంటివి వారు ఇప్పుడు చేస్తున్నారు. నేను నా కెరీర్‌లో 37ఏళ్లుగా ఆ పని చేస్తూనే ఉన్నానని ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన వారి గురించి తాను సమాధానం చెపాల్సిన అవసరం లేదని, తనకు చట్టంపై నమ్మకం ఉందని, వారే తనకు భద్రత కల్పిస్తారని, చివరకు న్యాయమే గెలుస్తుందని బదులిచ్చాడు. నన్ను ఎలాగైనా జైలుకు పంపాలని వారు ప్రయత్నిస్తున్నారని, అది జరిగితేనే వారికి ఆనందమని చెప్పాడు. తన 37ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలలో హీరోయిన్లతో ఘాటు ముద్దుసీన్లు చేశానని, మరి వాటిని వారెందుకు నాడు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.
ఇక రజినీ రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, తాను వ్యవస్థ చెడిపోయిందని రెండేళ్ల కిందటే చెప్పానని, తాజాగా రజినీ అదే చెప్పాడన్నారు. రాజకీయాలలోకి వచ్చి మంచి చేయకపోతే మిగిలిన వారిని విమర్శించినట్లుగానే నేను ఆయన్ను కూడా విమర్శిస్తానన్నాడు. ఇక జీఎస్టీకి తాను వ్యతిరేకంకాదని, కానీ పన్ను తగ్గించాలని కోరుకుంటున్నానని, థియేటర్‌లోని నా సినిమా కంటే ఇంటర్వెల్‌లో తాగే కూల్‌డ్రింక్స్ ఎక్కువ రేటుంటే తాను తట్టుకోలేనని ఘాటుగా వ్యాఖ్యానించాడు.