Advertisementt

'స్పైడర్‌'పై రోజుకో వార్త...!

Thu 13th Jul 2017 09:35 PM
mahesh babu,murugadoss,spyder movie,koratala siva,balakrishna  'స్పైడర్‌'పై రోజుకో వార్త...!
Mahesh Babu Play Games With Direction Departmet 'స్పైడర్‌'పై రోజుకో వార్త...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా 'స్పైడర్‌'ని చెప్పుకోవచ్చు. మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈచిత్రంలో కేవలం రెండుపాటలు మాత్రమే బాకీ ఉన్నాయి. ఒక పాటను మహేష్‌-రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ల మధ్య రొమాంటిక్‌ సాంగ్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ప్రత్యేక సెట్‌లో చిత్రీకరించారు. ఇక చివరి పాటను యూరప్‌లో ఆగష్టు2 నుంచి చిత్రీకరించనున్నాడు. 

ఇక ఈ చిత్రం గ్రాఫిక్స్‌ పనులను హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో పాటు టర్కీ, ఇరాన్‌ వంటి దేశాలలో జరుపుతున్నారు. విఎఫ్‌ఎక్స్‌ పనులను కూడా విదేశీ నిపుణులే పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే సమయంలో మహేష్‌ 'స్పైడర్‌'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్‌ అనే నేను' చిత్రం షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ఈ చిత్రం విడుదల విషయంలో ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎలాగైన సెప్టెంబర్‌ 22న విడుదల చేసి దసరా హాలీడేస్‌ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మహేష్‌ పట్టుదలతో ఉన్నాడు. 

కానీ మురుగదాస్‌ మాత్రం ఇది కేవలం తెలుగులో మాత్రమే విడుదలయ్యే చిత్రం కాదని, తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్‌ కానున్న దృష్ట్యా ఇతర సినిమాలు పోటీ ఉండటంతో సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయడమే బెటర్‌ అంటున్నాడు. అయినా సెప్టెంబర్‌ 27న బాలయ్యతో క్లాష్‌ తప్పదు కదా...! కాగా ఈ చిత్రం షూటింగ్‌లో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని పలువురితో మహేష్‌ కొన్ని సరదా గేమ్‌లు ఆడాడు వాటిని తీసిన మురుగదాస్‌ వాటిని సోషల్‌ మీడియాలో పెట్టడంతో మంచి స్పందన లభిస్తోంది. 

Mahesh Babu Play Games With Direction Departmet:

Spyder movie Director by AR Murugadoss said, Movie release on 27th September. and Mahesh babu Play fun Games with spyder movie Direction Departmet.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ