పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు మామూలు అంచనాలు కాదండోయ్... సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ గాని టైటిల్ గాని ఇంకా బయటికి రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు శాటిలైట్ రైట్స్ అన్నీ రికార్డు స్థాయిలో జరగడం చూస్తుంటే ఈ సినిమాకున్న క్రేజ్ అర్ధమవుతుంది. మామూలుగానే పవన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్, హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్, ఖుష్బూ, ఇంద్రజ వంటి నటులు ఈ మూవీలో నటించడం వంటి విషయాలు కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి.
ఇక పవన్ - త్రివిక్రమ్ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎప్పుడో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి కనెక్ట్ అయిన త్రివిక్రమ్, పవన్ సినిమాకోసం అనిరుధ్ ని రప్పించుకున్నాడు. ఇక ఈ చిత్రంలో ఒక్క పాట మినహా అన్ని పాటలు పూర్తయ్యని చెబుతున్నాడు అనిరుద్. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఒక పాట కూడా పాడించాలనుకుంటున్నామని చెబుతున్న అనిరుద్ తెలుగులో పవన్ సినిమా హిట్ అయితే గనక ఏడాది కి ఒక తెలుగు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తానని చెబుతున్నాడు. ఇక హైదరాబాద్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్ర యూనిట్ ఈ నెల 19 న షూటింగ్ కోసం యూరప్ వెళ్లనున్నారట.