మణిశర్మ... నిన్నా మొన్నటి వరకు ఆయన స్టార్ హీరోలు, దర్శకనిర్మాతల మొదటి చాయిస్, కానీ కొంతకాలంగా ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ మెలోడీ బ్రహ్మకు క్యాచీ ట్యూన్లు ఇవ్వడమే కాదు.. అత్యద్భుతమైన ఆర్ ఆర్ ఇవ్వడంతో సుప్రసిద్దుడు. ఇంకా చెప్పాలంటే ఆయన ట్యూన్స్ కంటే ఆయన ఆర్ ఆర్‌ని ఇష్టపడేవారు, వాటివల్లనే ఆడిన సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన 'అమీతుమీ'కి మ్యూజిక్ అందించాడు.
'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'కి వంశీతో కలిసి పని చేశాడు. ఇక తాజాగా ఆయన నితిన్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'లై', రానా-తేజల 'నేనే రాజు.. నేనే మంత్రి' చిత్రాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. ఇక మరో సీనియర్ సంగీత దర్శకుడైన కీరవాణి సామాన్యంగా ఎవ్వరినీ పొగడడు. అందునా వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినీ సాహిత్యం అంపశయ్యపై ఉందనడం, తమన్ గురించి కాస్త నెగటివ్‌గా స్పందించి, నానా విమర్శలు ఎదుర్కొన్నాడు.
తాజాగా కీరవాణి.. మణిశర్మ బర్త్‌డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, మణిశర్మ స్వరపరిచిన 'డిస్టర్బ్ చేయకు', 'సదా శివా సన్యాసి' పాటలు తనకిష్టమైన ఎవర్‌గ్రీన్ పాటలంంటూ కితాబునిచ్చేశాడు. ఇలా ఓ సీనియర్ సంగీత దర్శకుడు, మరో సీనియర్‌ని పొగడటం ద్వారా తన గొప్పతనాన్ని కీరవాణి చాటుకున్నాడని ప్రశంసలు లభిస్తున్నాయి.