సాయి కొర్రపాటి నిర్మాతగా జగపతిబాబు హీరోగా 'పటేల్ సార్' రిలీజ్‌కు సిద్దమవుతున్న సంగతి తెలసిందే. తనదైన తెల్లని గడ్డం, నెరసిన జుట్టుతో జగపతిబాబు తన పెప్పర్ సాల్ట్ స్టైల్లో ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఇందులో చెడ్డవాడిని, చెడ్డ వాడు ఎలా దెబ్బతీశాడనేదే ముఖ్య కధాంశం. కాగా ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ, సాయికి ఒళ్లు బలిసి ఈ చిత్రాన్ని నిర్మించలేదు.
ఇక నేను గులతో ఈ చిత్రంలో హీరోగా చేయలేదు. జనాలు ఎంత మాత్రం అలా అనుకోకుండా మా 'పటేల్‌సార్' ఉంటుంది. ఇక విలన్ పాత్రలు చేసేముందు గ్యాప్ తీసుకున్నారేమిటి అని అడిగితే నేను గ్యాప్ తీసుకోలేదు ఇండస్ట్రీనే గ్యాప్ ఇచ్చింది. ఆ సమయంలో నాకు పాత్రలు రాకపోవడంతో కామ్‌గా ఉన్నానని తెలిపాడు. ఇక ఫాల్‌డౌన్ అయిన తర్వాత విలన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్లలో బిజీగా మారిన తర్వాత మరలా జగపతిబాబు హీరోగా నటిస్తుండటంపై పలు సెటైర్లు వినిపిస్తున్నాయి.
దీనికి జగపతిబాబు కరుకైన సమాధానం చెప్పాడు. ఈ వయసులో నాకు హీరోగా చేయాలనిలేదు. హీరో అనిపించుకోవాల్సిన అసవరం కూడా లేదు. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు చేయకపోతే నాకే విసుగొస్తుందని తెలిపాడు. స్వయంగా తన భార్యే హాయిగా విలన్, సపోర్టింగ్‌రోల్స్ చేసుకుంటున్న మీరు ఇప్పుడు హీరోగా నటించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించిందని, కానీ ఈ కథతో వున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇందులో హీరోగా నటించాల్సి వచ్చింది.
ఈ చిత్రం హిట్టయితే మరలా హీరోగా నటిస్తానని భావించవద్దు. పాత తరహాలోనే విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా నటిస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఇలాంటి విభిన్న పాత్రలు వస్తే హీరోగా నటిస్తానని కుండ బద్దలు కొట్టాడు.