Advertisementt

బన్నీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి!

Thu 13th Jul 2017 10:42 AM
varun tej,fidaa movie,dil raju,allu arjun,pawan kalyan,varun tej sataires on allu arjun  బన్నీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి!
Varun Tej Indirect Sataires on Allu Arjun బన్నీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి!
Advertisement
Ads by CJ

అల్లుఅర్జున్‌ ఆమద్య పవన్‌ అభిమానులను ఉద్దేశించి చెప్పను బ్రదర్‌ అని చేసిన వ్యాఖ్యల వల్ల బన్నీకి యాంటీ ఫ్యాన్స్‌ ఎక్కువయ్యారు. ఆమద్య సాయి ధర మ్‌తేజ్‌ తాను పవన్‌ గురించి మాట్లాడాలంటే ఎంతో సంతోషిస్తానని చెప్పి బన్నీ మాటలకు చెక్‌ పెట్టాడు. ఇప్పుడు యువ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఇన్‌డైరెక్ట్‌గా బన్నీపై పంచ్‌లేశాడని సోషల్‌ మీడియాలో హడావుడి జరుగుతోంది. 

ఇటీవల జరిగిన 'ఫిదా' ఆడియో వేడకలో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ, మేం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే అది పెదనాన్న చిరంజీవి, బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ల వల్లనే. వారి గురించి మాట్లాడాల్సి వస్తే.. అందునా ఇలాంటి పెద్ద పెద్ద వేదికలపై వారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆ చాన్స్‌ను నేను అస్సలు వదులుకోను... మేము మాట్లాడేటప్పుడు అందరూ ఇష్టపడాలని రూల్‌ ఏమీ లేకపోయినా.. మేము వారి గురించి గుర్తు చేసుకోవడం మాత్రం మర్చిపోము... అంటూ మాట్లాడాడు. 

ఈ మాటల వెనుక ఆయన బన్నీని టార్గెట్‌ చేసినట్టుగా పలువురు భావిస్తున్నారు. ఇక 'డిజె' చిత్రం కలెక్షన్లు నాన్‌ బాహుబలి రికార్డులను తుడిచిపెట్టాయి.. అంటే దాని అర్ధం ఖైదీ నెంబర్‌ 150ని కూడా దాటేశాయనే కదా...! కానీ దిల్‌ రాజు మాత్రం చిరంజీవితో మేము మాకలెక్షన్లను డిజెతో పోల్చలేదు. ఆయనకు ఆయనే సాటి.. అంటూ జోలపాటపాడుతున్నాడు. 

Varun Tej Indirect Sataires on Allu Arjun:

Varun Tej's indirect Sataires on Allu Arjun in 'Fidaa' movie audio function about Pawan Kalyan.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ