వరుణ్ సందేశ్ ముద్దుల భార్య వితిక ఆత్మహత్యాయత్నం చేసిందని సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒకటే న్యూస్ ప్రచారం అవుతుంది. వారి మధ్యలో వచ్చిన మనస్పర్థల కారణంగానే వితిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని... నిద్ర మాత్రలు మింగి స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టు ఒకటే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. వరుణ్ సందేశ్, వితిక సెరులు ఎప్పటినుండో ప్రేమలో పడి గత ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. అప్పటినుండి వీరు చాలా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఈ మధ్యన వీరు సఖ్యతగా ఉండడంలేదని అందుకే వితిక ఇలాంటి పనిచేసినట్లు ప్రచారం జరుగుతుంది
అయితే వితిక ఆత్మహత్యాయత్నం ఒట్టి పుకారేనంటా. ఈ విషయాన్ని వితికే స్వయంగా మీడియాకి తెలియజేసింది. తనకి తన భర్తకి ఎటువంటి గొడవలు లేవని.... తామెంతో ప్రేమగా ఉంటున్నామని .. కేవలం నాకు ఫుడ్ ఫాయిజన్ జరగడం వలెనే హాస్పిటల్ కి వెళ్లానని క్లారిటీ ఇచ్చింది. అయితే ముందుగా ఈ పుకారు వచ్చిన తర్వాత తన భర్త వరుణ్ లైట్ తీసుకోమన్నాడని.... కానీ ఈ పుకారు అంతకంతకు పెద్దది కావడంతో స్పందించాల్సి వచ్చిందని... అది కూడా తన భర్త అనుమతితోనే అంటూ చెప్పింది.
అయితే వితికకు నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఉందట. గత రాత్రి కూడా అలాగే నాలుగు టాబ్లెట్స్ వేసుకుందట.. కాని చచ్చిపోవాలనుకుంటే నాలుగు ఎందుకువేసుకుంటాను 40 వేసుకుంటానని వితిక చెబుతోందంటున్నారు. మరోపక్క ఫుడ్ ఫాయిజన్ అవ్వడం వలన హోస్పిటిల్ కి వెళితే ఆ ఫొటోస్ ని చూపించి ఆత్మహత్య అనడం దారుణమని అంటుంది.