మలయాళ నటి భావన పై లైంగిక దాడి కేసులో మలయాళ హీరో దిలీప్ కుమార్ ని తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. భావన కేసును సుదీర్ఘంగా పరిశీలించిన పోలీసులకు నటుడు దిలీప్ కుమార్ గురించి కొన్ని ఆధారాలు దొరకడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అసలు గత ఫిబ్రవరిలో భావనపై దాడి జరిగినప్పుడే దిలీప్ కుమార్ పేరు బయటికి వచ్చింది. ఫిలిం అసోషియేన్ లో ప్రధాన వ్యక్తిగా వున్న దిలీప్ కుమార్ ,భావన పై దాడి చేయించిన మాట వాస్తవమే అని పోలీస్ లు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కి తరలించారు. భావన కారు డ్రైవర్, మాజీ డ్రైవర్, వారి స్నేహితులను ఈ పనికి దిలీప్ పురమాయించినట్టు చెబుతున్నారు.
అయితే మొదటి నుండి అతని పేరు వినబడుతున్నప్పటికీ అతనికి వ్యతిరేఖంగా నోరు విప్పేందుకు ఏ ఒక్కరు బయటికి రాలేదు. దానికి కారణం అతనొక పెద్ద హీరో, ఫిలిం అసోషియేన్ లో ప్రధాన సభ్యుడు కావడం వలెనే అంటూ మలయాళంలో బిగ్ డైరెక్టర్ ఒకతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. దిలీప్ పరిశ్రమలోని ప్రముఖులను తన గుప్పెట్లో పెట్టుకున్నాడని.... అందుకే దిలీప్ పై గళం విప్పేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలెవరు సాహసం చేయలేకపోయారని మలయాళ డైరెక్టర్ వినయ్ ఆరోపిస్తున్నాడు. అసలు భావన పై జరిగిన దాడి గురించి ఎవ్వరూ పెద్దగా స్పందించకపోవడం ఎంతో సిగ్గు చేటని అంటున్నాడు.
ఇక దిలీప్ కుమార్, భావన తన గుప్పెట్లోకి రావడం లేదని ఆమెని కిడ్నాప్ చేసి భయపెట్టాలని ప్లాన్ చెయ్యడం.... ఆ పనికోసం పల్సర్ సునీ, అతడి స్నేహితులకు దిలీప్ కోటిన్నర రూపాయలు ఇచ్చి ఈ పనికి పురమాయించడం జరిగిందంటున్నారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు భావన కిడ్నాప్ విషయంలో దిలీప్ కి సంబందించిన ఆధారాలు దొరకడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ లెక్కన ఈ హీరో గారి కెరీర్ నాశనమవడమే కాకా పీకల్లోతు కష్టాల్లో కూడా కూరుకుపోయాడని అంటున్నారు సినీజనాలు.