Advertisementt

మెగాఫ్యామిలీ ఈ బామను వదలడం లేదు..!

Tue 11th Jul 2017 10:58 AM
lavanya tripati,vijay devarakonda,director parasuram,geetha arts 2  మెగాఫ్యామిలీ ఈ బామను వదలడం లేదు..!
Lavanya Tripati Bags New Film మెగాఫ్యామిలీ ఈ బామను వదలడం లేదు..!
Advertisement
Ads by CJ

ఒక్క మెగాహీరోతో కలిసి నటిచిందంటే ఇక గీతాఆర్ట్స్‌ బేనర్‌లో కూడా వరుస అవకాశాలు వస్తాయి. తాజాగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి దీనికి ఉదాహరణ. కాగా గతంలో పరుశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ నిర్మించిన 'శ్రీరస్తు.. శుభమస్తు' చిత్రం మొదటి సారిగా అల్లు శిరీష్‌కి పాస్‌ మార్కులు వేసింది. ఇక ఈ హాట్‌ బ్యూటీ లావణ్యత్రిపాఠి యంగ్‌ మెగా ఫ్యామిలీ హీరోల సరసనే కాదు.. ఏకంగా నాగార్జున వంటి సీనియర్‌ స్టార్‌తో కలిసి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన 'సోగ్గాడే చిన్నినాయనా'లో కూడా అదరగొట్టింది. 

తాజాగా ఆమె గీతా ఆర్ట్స్‌లో మరో చిత్రానికి అగ్రిమెంట్‌ చేసిందని సమాచారం. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ బేనర్‌ 2లో బన్నీ వాసు నిర్మాణంలో పరశురాం దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ పెట్టలేదు. హీరోయిన్లుగా పలువురిని పరిశీలించినప్పటికీ సెట్‌ కాలేదు.

దాంతో ఆల్‌రెడీ గీతా ఆర్ట్స్‌లో అందునా దర్శకుడు పరుశురాంతో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కూడా యూనిట్‌ లావణ్య త్రిపాఠికే ఓటు వేయడంతో ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఈ చాన్స్‌ని ఆమె సద్వినియోగం చేసుకుంటే రాబోయే కాలంలో ఆమెకు స్టార్స్‌గా ఎదుగుతున్న పలువురు యంగ్‌ హీరోల సరసన నటించే అవకాశాలు రావడం ఖాయమనే చెప్పాలి....! 

Lavanya Tripati Bags New Film:

Now, Parasuram is again directing a project for Bunny Vaas in the banner of Geetha Arts 2 and will have Vijay Devarakonda and Lavanya Tripati as the main lead pair.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ