కమల్‌హాసన్ పెద్దకూతురు సంగీతంలో రాణించాలని ఆశపడింది. చిన్నతనంలోనే తన తండ్రి నటించిన ఓ చిత్రానికి సంగీతం అందించడమే కాదు...గాయనిగా కూడా మారింది. ఓ మ్యూజికల్ ట్రూప్‌ని పెట్టుకుని పాప్ సంగీతంతో పాటు శాస్త్రీయ సంగీతంలో కూడా పలు ఆల్బమ్స్ రూపొందించింది. సంగీత కళాకోవిదురాలిగా మారాలని ఆశపడింది. కానీ అనుకోకుండా నటిగా ప్రవేశించి రాణిస్తోంది.
కమల్ రెండో కూతురు అక్షర హాసన్‌ది మరో కోరిక. ఆమె దర్శకురాలిగా మారాలని చిన్నతనం నుంచి భావిస్తూ వస్తోంది. దాంతోనే బాల్కీ అనే దర్శకుని వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసింది. తన తండ్రి తీయనున్న 'శభాష్ నాయుడు'కి కూడ దర్శకత్వంలో చేరింది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రం ఆగిపోయి ఉంది. మరోవైపు అక్షరహాసన్ అభిరుచికి భిన్నంగా ఆమెకు నటిగా అవకాశాలొస్తున్నాయి. బాలీవుడ్‌లో 'షమితాబ్' చిత్రంతో అలరించింది. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న అజిత్-శివల 'వివేగం'లో కీలకపాత్రను చేసింది. తాజాగా ఆమెకు పూర్తి స్థాయి హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని సమాచారం.
ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత, దర్శకుడు రవిచంద్రన్ కుమారుడు విక్రమ్ చందన్ తెరంగేట్రం చేయనున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మాతృభాషైన తమిళం, మంచి డిమాండ్ ఉన్న తెలుగు, హిందీలని కాదని, ఆమె తన పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రను ఓ శాండల్‌వుడ్ మూవీ ద్వారా జరగనుండటం విశేషమే.