'బాహుబలి' రెండు పార్ట్స్ కోసం రాజమౌళితో పాటు యూనిట్ మొత్తం ఐదేళ్లు కష్టపడి దానికి తగ్గ ప్రతిఫలం అందుకుంది. కాగా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' విడుదలై రెండు నెలలవుతోంది. ఇప్పటి వరకు రాజమౌళి తన తదుపరి మూవీపై క్లారిటీ ఇవ్వలేదు. తన వద్ద రెండు కమిట్‌మెంట్స్ ఉన్నాయని, కానీ వాటికి చాలా సమయం పడుతోందని అంటున్నాడు. 'బాహుబలి' తర్వాత నేను మారిపోయానని అందరూ అనుకోవచ్చు.
ఇప్పుడు నాకంటూ రెస్ట్ టైం కాస్త ఎక్కువగా ఉంది. అంతే.. అంతకు మించి ఏమీ లేదు...ఇంకా భారీ ప్రాజెక్ట్‌లు, భారీస్థాయిలో తీసే ఆలోచనలు ఉన్నాయి. వాటిల్లో నేను విజయం సాధిస్తానా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాననే భావన కొద్దిగా ఉంది. కానీ ఇది ఖాళీనా? లేక నా అంతట నేను పొందుతున్న సంతృప్తా? అనేది నాకే తెలియడం లేదు. 'బాహుబలి' తెచ్చిన లాభాలలో నా అకౌంట్‌లోకి వచ్చింది మాత్రం చిన్న మొత్తమే. ఒక అద్బుతమైన కల సాకారం అయింది. సమయం వచ్చినప్పుడు నా తదుపరి ప్రాజెక్ట్ గురించి చెబుతాను....వాటిపై ఇప్పుడే మాట్లాడటం సాధ్యం కాదు...ఇంకా చాలానే వర్క్ చేయాల్సివుంది... అంటున్నాడు.
కాగా రాజమౌళి తన తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోనే ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కానీ ముందుగా అనౌన్స్ చేస్తే అనవసరపు హైప్ క్రియేట్ చేసినట్లు అవుతుందని ఎన్టీఆర్, రాజమౌళిలు మౌనంగా ఉన్నారంటున్నారు. ఇప్పటికే ఓ స్టోరీలైన్ ఖరారైందని, విజయేంధ్ర ప్రసాద్‌తో పాటు రాజమౌళి కూడా ఆ కథపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే వీరిద్దరు 'స్టూడెంట్‌నెం1, సింహాద్రి, యమదొంగ'లతో హ్యాట్రిక్ కొట్టారు.
కాగా ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' తర్వాత ఎన్టీఆర్ చేయబోయేది ఇదే ప్రాజెక్ట్ అంటున్నారు. మరి దీని తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాల్సి ఉంది. త్రివిక్రమ్‌తో చేయాలని ఎప్పటి నుంచో జూనియర్ ఆసక్తి చూపిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ 'జై లవ కుశ' తర్వాత త్రివిక్రమ్‌తో వెళ్లాడా? లేక ఇదంతా ఒట్టి గాలివార్తలేనా? అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది...!